గాయాన్ని లెక్కచేయకుండా కుర్రాళ్లకు పాఠాలు చెబుతున్న రోహిత్ శర్మ..!

ఎడమ తొడ కండరాల గాయంతో దక్షిణాఫ్రికా టెస్ట్ క్రికెట్ సిరీస్ కు దూరమైన రోహిత్ శర్మ ఇప్పుడు నేషనల్ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నాడు.వైద్యుల ప్రకారం హిట్ మ్యాన్ పూర్తిగా రికవర్ కావడానికి ఇంకా మూణ్నాలుగు వారాల సమయం పడుతుంది.

 Rohit Sharma Telling Lessons To Guys Regardless Of Injury Rohit Sharma, Injured-TeluguStop.com

ప్రస్తుతం బెంగళూరులోని ఎన్‌సీఏలో ఫిజియో థెరపిస్టులు పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు రోహిత్.ఈ క్రమంలో తాజాగా కుర్రాళ్లకి పాఠాలు నేర్పించాడు.

ఈ నెల 23 నుంచి యూఏఈ వేదికగా అండర్ 19 ఆసియాకప్ జరగనుంది.ఈ ట్రోఫీని కైవసం చేసుకునేందుకు భారత అండర్-19 జట్టు నేషనల్ క్రికెట్ అకాడమీలో శ్రద్ధగా శిక్షణ తీసుకుంటోంది.

ప్రస్తుతం రోహిత్ కూడా ఎన్‌సీఏలో ఉండటంతో అండర్-19 జట్టు ప్లేయర్లను కలిశాడు.వారితో కాసేపు ముచ్చటించిన తర్వాత విలువైన క్రికెట్ పాఠాలు నేర్పించాడు.

గేమ్‌లో ఛాలెంజెస్ ఎదురైనప్పుడు చతికల పడకుండా ఎలా ముందుకు సాగాలో చెబుతూ విలువైన సలహాలను వారితో పంచుకున్నాడు.వన్డే, టీ20 కెప్టెన్ రోహిత్ చెప్పిన పాఠాలు, సలహాలను శ్రద్ధగా విన్నారు యువ క్రికెటర్లు.

రోహిత్ శర్మ షేర్ చేసిన విలువైన సూచనలు అండర్-19 జట్టుకు కచ్చితంగా ఉపయోగపడతాయని మేనేజ్‌మెంట్‌ వెల్లడించింది.గాయాన్ని కూడా లెక్కచేయకుండా రోహిత్ శర్మ యువ క్రికెటర్లకు సహాయపడిన తీరు ఇప్పుడు అందరినీ ఫిదా చేస్తోంది.

Telugu Latest, Rohit Sharma-Latest News - Telugu

అయితే యువ ఆటగాళ్లు, రోహిత్ శర్మలకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ తన ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేసింది.వాల్యూబుల్ లెసన్స్ అంటూ ఈ ఫొటోలకు క్యాప్షన్ జోడించింది.కాగా ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.డిసెంబర్ 26 నుంచి విరాట్ కోహ్లీ సారథ్యంలో టీమ్ ఇండియా జట్టు దక్షిణాఫ్రికా తో రెడ్ బాల్ క్రికెట్ ఆడనుంది.

ఈ టెస్టుల్లో రోహిత్ శర్మకు బదులు ప్రియాంక్ పాంచాల్ ఆడనున్నాడు.మరి వన్డే మ్యాచ్ లకైనా అందుబాటులో ఉంటాడో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube