ఈ బాలీవుడ్ హీరోయిన్ల ఆస్తులెంతో తెలిస్తే షాకవ్వాల్సిందే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లతో పోలిస్తే బాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు పారితోషికం ఎక్కువనే సంగతి తెలిసిందే.ఇతర భాషల్లో కూడా క్రేజ్ ఉండటంతో ఈ హీరోయిన్లు ఇతర భాషల సినిమాలకు బాలీవుడ్ లో తీసుకునే పారితోషికం కంటే ఎక్కువమొత్తం పారితోషికం తీసుకుంటున్నారు.

 Bollywood Industry Star Heroines Assets Value Details Here , Bollywood Star Hero-TeluguStop.com

చాలా సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్లుగా రాణిస్తుండటంతో కొంతమంది ఫిమేల్ స్టార్స్ ఊహించని స్థాయిలో సంపాదించారు.

కొంతమంది బాలీవుడ్ హీరోయిన్ల సంపాదన వందల కోట్ల రూపాయలు కావడం గమనార్హం.

టాలీవుడ్ సినిమాలలో ఎక్కువగా నటించి బాలీవుడ్ ఇండస్ట్రీలో గుర్తింపును సంపాదించిన తాప్సీ ఆస్తుల విలువ 44 కోట్ల రూపాయలుగా ఉంది.లేడీ ఓరియెంటెడ్ సినిమాల ద్వారా తాప్సీకి పాపులారిటీ పెరిగింది.

ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ సినిమాలకే పూర్తిగా పరిమితమయ్యారు.

Telugu Alia Bhatt, Bollywood, Deepikapadukone, Kareena Kapoor, Katrinakaif-Movie

బాలీవుడ్ నటి దీపికా పదుకొనే ఓం శాంతి ఓం సినిమాతో ఎంట్రీ ఇచ్చారు.ప్రస్తుతం దీపికా పదుకొనే వయస్సు 34 సంవత్సరాలు కాగా ఆమె ఆస్తుల నికర విలువ 118 కోట్ల రూపాయలుగా ఉంది.బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో అలియా భట్ ఒకరు కాగా ఆమె ఆస్తుల విలువ 162 కోట్ల రూపాయలుగా ఉంది.

మరో స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఆస్తుల విలువ 218 కోట్ల రూపాయలుగా ఉంది.మరో స్టార్ హీరోయిన్ అనుష్క శర్మకు సొంతంగా నిర్మాణ సంస్థ ఉంది.

అనుష్క శర్మ సంపాదన విలువ 255 కోట్ల రూపాయలని సమాచారం.

Telugu Alia Bhatt, Bollywood, Deepikapadukone, Kareena Kapoor, Katrinakaif-Movie

బాలీవుడ్ హీరోయిన్లలో కరీనా కపూర్ ఒకరు.కరీనా కపూర్ చేతిలో ఎన్నో బ్రాండ్ ఎండార్స్ మెంట్లు ఉన్నాయి.కరీనా కపూర్ ఆస్తుల విలువ 440 కోట్ల రూపాయలుగా ఉంది.

ఈ స్టార్ హీరోయిన్ల ఆస్తుల విలువ తెలిసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.టాలీవుడ్ హీరోయిన్లలో కూడా కాజల్, సమంత, మరికొందరు హీరోయిన్లు సినిమాల ద్వారా వందల కోట్ల రూపాయలు సంపాదించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube