అఖండ మూవీపై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్.. ఏపీ పరిస్థితులు చూపించారంటూ?

స్టార్ హీరో బాలకృష్ణ నటించి పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్న అఖండ మూవీ 9 రోజుల్లో 55 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సాధించింది.నిన్న విడుదలైన ఎనిమిది సినిమాలలో ఏ సినిమాకు కూడా పాజిటివ్ టాక్ రాకపోవడంతో అఖండ సినిమానే ఈ వారం కూడా ప్రేక్షకులకు ఆప్షన్ గా మిగిలింది.

 Ap Ex Chief Minister Chandrababu Shocking Comments About Akhanda Movie , Akhanda-TeluguStop.com

సింహా, లెజెండ్ సినిమాలను మించి బాలయ్య, బోయపాటి శ్రీను సక్సెస్ సాధించారు.

అఖండ సక్సెస్ ఇండస్ట్రీకి కూడా కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.

బాలయ్య సక్సెస్ ను సొంతం చేసుకోవడంతో టీడీపీ అభిమానులు సైతం సంతోషిస్తున్నారు.అయితే తాజాగా మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అఖండ సినిమాను చూసి ఆ సినిమా గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

ఏపీలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఆ పరిస్థితులనే అఖండ సినిమాలో చూపించారని చంద్రబాబు వెల్లడించారు.

సినిమాలో చూపించిన సన్నివేశాలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్నాయని ఆయన చెప్పుకొచ్చారు.

అఖండ సినిమా బాగుందని చంద్రబాబు మెచ్చుకోవడంతో పాటు అఖండ చిత్రయూనిట్ కు అభినందనలు తెలిపారు.దర్శకుడు బోయపాటి శ్రీను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులను కళ్లకు కట్టినట్టుగా చూపించాడని చంద్రబాబు వెల్లడించారు, రాష్ట్రంలో ఉండే యువత కూడా అఖండ సినిమా చూడాలని చంద్రబాబు అన్నారు.

Telugu Akhanda, Chandrababu, Review-Movie

అదే సమయంలో చంద్రబాబు ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.చంద్రబాబు అఖండ గురించి పాజిటివ్ కామెంట్లు చేయడంతో బాలయ్య ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.బాలయ్య అఖండ సక్సెస్ తో పారితోషికం పెంచారని కామెంట్లు వినిపిస్తున్నాయి.బాలయ్య ప్రస్తుతం ఒక్కో సినిమాకు పది కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.

బాలయ్య వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తుండగా సక్సెస్ లో ఉన్న దర్శకులే బాలయ్య తర్వాత సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube