1.అక్రమ విదేశీ కార్మికుల నియామకాలపై సౌదీ అరేబియా కీలక నిర్ణయం
అక్రమంగా విదేశీ కార్మికులను నియనించుకునే సంస్థలు, వ్యాపార సముదాయాలపై సౌదీ అరేబియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఇకపై విదేశీ కార్మికులను అక్రమంగా నిర్మించుకుంటే సదరు సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్ పోర్ట్స్ హెచ్చరించింది.
2. గల్ఫ్ దేశాలలో ఒమిక్రాన్ కేసులు
గల్ఫ్ దేశాలలో ఒమి క్రాన్ కేసులు నమోదు అయ్యాయి.సౌదీ అరేబియా, యూఏఈ లో తొలి కేసులు నమోదయ్యాయి.ఈ విషయాన్ని రెండు దేశాల వైద్య అధికారులు ప్రకటించారు.
3. టూరిస్ట్ వీసాల జారీ కఠినతరం చేసిన కువైట్
ప్రపంచ వ్యాప్తంగా ఒమీ క్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టూరిస్ట్ వీసాల జారీని కువైట్ కఠినతరం చేసింది.దాదాపు 53 దేశాల కు టూరిస్ట్ వీసాల జారీలో కఠిన ఆంక్షలు విధించింది.
4.బ్రిటన్ నుంచి హైదరాబాద్ వచ్చిన మహిళకు ఒమి క్రాన్
బ్రిటన్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఓ మహిళకు ఒమిక్రాన్ వైరస్ లక్షణాలు బయటపడ్డాయి.
5.ఇండియాకు 3500 కోట్ల రుణం .ఆమోదించిన ప్రపంచ బ్యాంక్
ఇండియాలో చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకు రుణ సహాయాన్ని ప్రకటించింది.3500 కోట్లు ఇచ్చేందుకు అనుమతి ఇచ్చింది.
6.ఒమి క్రాన్ పై డబ్ల్యూహెచ్ వో కీలక ప్రకటన
సౌతాఫ్రికా లో బయటపడిన ఒమి క్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది.ఈ వైరస్ ప్రభావంతో రోజు రోజు కూ ఆందోళన పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన చేసింది.ఈ వైరస్ విషయంలో అనవసర ఆందోళన చెందవద్దని సూచించింది.
7.అమెరికాలో తొలి ఒమి క్రాన్ కేసు నమోదు
అమెరికాలో తొలి ఒమి క్రాన్ కేసు నమోదు అయ్యింది.గత నెల 22 న దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఓ వ్యక్తి కి ఈ వైరస్ లక్షణాలు బయటపడ్డాయి.
8.హోండరూస్ తొలి మహిళా అధ్యక్షురాలిగా షియోమర
సెంట్రల్ అమెరికా దేశమైన హోండరూస్ తొలి మహిళా అధ్యక్షురాలిగా షియోమర ఎన్నికయ్యారు.
9.ఒమిక్రాన్ ప్రమాదం యువతలో నే ఎక్కువ
కొత్త కరోనా వేరియంట్ ఒమి క్రాన్ ప్రభావం ఎక్కువ యువతలో నే అని ఉంటుంది అని దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు తెలిపారు.
10.ఇరాన్ తాలిబన్ సైనికుల మధ్య భీకర పోరు
ఇరాన్ తాలిబన్ సైనికుల మధ్య చిన్నగా మొదలైన గొడవ చెలరేగి , తీవ్ర రూపం దాల్చింది.ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని ఇరు దేశాలకు చెందిన అధికారులు తెలిపారు.