1.సోనియాతో కాంగ్రెస్ నేతల భేటీ
ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ నేతలు కీలక భేటీ నిర్వహించనున్నారు ఈ సందర్భంగా పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.
2.బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమం పై అసెంబ్లీలో చర్చ
ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేడు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమం పై చర్చ జరగనుంది.వీటితో పాటు ఉ మరో మూడు బిల్లులు ఏపీ ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టే బోతోంది.
3.నేడు కిసన్ మహా పంచాయత్
హైదరాబాద్ లో నేడు కిసాన్ మహా పంచాయత్ కార్యక్రమం నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమానికి బి కే యు నేత రాకేష్ టికాయత్ హాజరు కాబోతున్నారు.
4.నేడు బిసి జనగణ తీర్మానం
బీసీ జనగణన తీర్మానాన్ని నేడు ఏపీ మంత్రి వేణుగోపాల్ కృష్ణ ఏపీ మండలి లో ప్రవేశపట్టనున్నారు.
5.సివిల్ సప్లై మంత్రులతో నేడు కేంద్ర మంత్రి భేటీ
అన్ని రాష్ట్రాల సివిల్ సప్లై మంత్రులతో నేడు కేంద్ర మంత్రి పియూష్ గోయల్ భేటీకానున్నారు.
6.తెలంగాణకు వర్ష సూచన
తెలంగాణలో నేడు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
7.స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కి కరోనా
తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
8.రాయలసీమ పై చంద్రబాబు కామెంట్స్
వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే రాయలసీమ జిల్లాలు అతలాకుతలం అయ్యాయి అని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు.
9.శివ శంకర్ మాస్టర్ ఫ్యామిలీ కి సోనూసూద్ అండ
కరుణ వైరస్ ప్రభావం తో తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శివ శంకర్ మాస్టర్ కుటుంబానికి తాను అన్ని రకాలుగా అండదండలు అందిస్తానని బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ప్రకటించారు.
10.తెలంగాణలో 3 ఎమ్మెల్సీలు ఏకగ్రీవం
తెలంగాణ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీలు మూడు ఏకగ్రీవమయ్యాయి.నిజామాబాద్ జిల్లా నుంచి కల్వకుంట్ల కవిత, ఉమ్మడి రంగారెడ్డి నుంచి పట్నం మహేందర్ రెడ్డి, శంబి పూర్ రాజు ఉన్నారు.
11.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 9,119 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
12.చంద్రబాబు పై రోజా సంచలన కామెంట్స్
టిడిపి అధినేత చంద్రబాబు కుప్పం దెబ్బతో పిచ్చెక్కింది అని ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.
13.శ్రీవారి సేవలో తెలంగాణ ఆర్టీసీ చైర్మన్
తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
14.దిశా కమిటీ సమావేశం.అధికారులపై కిషన్ రెడ్డి ఆగ్రహం
హైదరాబాద్లోని బేగంపేట్ టూరిజం ప్లాజా దిశా కమిటీ సమావేశం ప్రారంభమైంది.కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై చర్చించారు.ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ జిహెచ్ఎంసి కమిషనర్ హాజరుకాకపోవడంపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
15.రేపటి నుంచి ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
రేపటి నుంచి మూడు రోజుల పాటు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
16.కొండపల్లి ఎన్నిక పై నేడు హైకోర్టులో విచారణ
ఏపీ ల ఉత్కంఠ రేపిన కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.
17.జూనియర్ ఎన్టీఆర్ పై టిడిపి నేతల సంచలన కామెంట్స్
చంద్రబాబు కుటుంబానికి జరిగిన అవమానంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన తీరు పై టిడిపి నేతలు వర్ల రామయ్య, బుద్ధా వెంకన్న సంచలన కామెంట్ చేశారు.జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన తీరు సరిగా లేదంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
18.సబ్ మెరైన్ ఐఎన్ఎస్ వెల జలప్రవేశం
ఫోర్త్ స్కార్పిన్ కు చెందిన జలాంతర్గామి ఐఎన్ఎస్ వెల జలప్రవేశం చేశాయి.ముంబైలోని డాక్ యార్డ్ లో ఈ కార్యక్రమం జరిగింది.
19.తెలుగు రాష్ట్ర మహిళ ల ఇళ్ళ ల్లో సోదాలు
ఏపీ తెలుగు మహిళ రాష్ట్ర నేతలు స్వప్న, విజయ శ్రీ ఇళ్ల పై పోలీసులు దాడులు చేసి తనిఖీలు నిర్వహించారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 44,700 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 48,760