కోర్టుకు వెళ్లే ఉద్దేశ్యం లేదన్న 'ఆర్ఆర్‌ఆర్‌' టీమ్‌

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యి విడుదలకు సిద్దం అయ్యింది.తెలుగు సినిమా చరిత్రలో ఎప్పుడు లేనంతగా ఈ సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందించడం జరిగింది.

 Rrr Producers Clarity About Court Case Details, Ap Govt, Rrr, Rajamouli, Tollyw-TeluguStop.com

పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేయబోతున్న ఈ సినిమాకు సంబంధించిన విడుదల విషయంపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.సంక్రాంతి కానుకగా సంక్రాంతి కంటే వారం రోజుల ముందుగానే ఈ సినిమా విడుదల కాబోతుంది.

సినిమా కు పెట్టిన భారీ బడ్జెట్‌ కారణంగా టికెట్ల రేట్లను భారీ ఎత్తున పెంచాలని బయ్యర్లు కోరుకుంటున్నారు.అందుకు గాను తెలుగు రాష్ట్రాల నుండి అనుమతులు తీసుకోవాలని భావిస్తున్నారు.

అందుకోసం తెలంగాణ ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చే అకవాశం ఉంది.కాని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అందుకు అనుకూలంగా లేదని తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో వసూళ్ల విషయంలో చిత్ర యూనిట్‌ సభ్యులు ఆందోళనతో ఉన్నారు.

ఏపీలో టికెట్ల రేట్లను పెంచడం కోసం నిర్మాతలు డిమాండ్ చేస్తున్నారు.

ఈ సమయంలో ఆర్ ఆర్ ఆర్ టీమ్‌ ఏపీ ప్రభుత్వం టికెట్ల రేట్లు పెంచడం లేదు అంటూ కోర్టును ఆశ్రయించేందుకు సిద్దం అయ్యింది అంటూ ప్రచారం మొదలు అయ్యింది.ఈ విషయంలో చిత్ర యూనిట్‌ సభ్యులు స్పందించారు.

తాము కోర్టుకు వెళ్లాలని అనుకోవడం లేదు.

Telugu Ap, Ticket Rates, Rajamouli, Ram Charan, Rrr Buyers, Rrr Makers, Rrr, San

అసలు ఆ ఉద్దేశ్యం మాకు ఏమీ లేదు.మేము ప్రభుత్వ నిర్ణయానుసారంగా వెళ్తాం.ఒక వేళ ప్రభుత్వం టికెట్ల రేట్లను పెంచకున్నా కూడా అనుకున్నట్లుగానే విడుదల చేస్తామని ప్రకటించారు.

మొత్తానికి ఈ సినిమా కోసం కోర్టుకు వెళ్లేది లేదు అని తేల్చి చెప్పారు.ఆర్ ఆర్‌ ఆర్‌ మేకర్స్ తెలుగు రాష్ట్రాల ఫలితాల కంటే కూడా బయటి ఫలితాల పై ఎక్కువ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube