వాట్సాప్ స్టేటస్ ఈజీగా డౌన్‌లోడ్ చేయండిలా..!

ప్రముఖ మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్ లో తెలిసిన వారితో మాట్లాడటమే కాకుండా స్టేటస్ లు కూడా పెట్టుకోవచ్చు.30 సెకండ్ల పాటు మనకిష్టమైన పాటలు గానీ లేదా జీవిత విశేషాలు గానీ వీడియో రూపంలో వాట్సాప్ లో స్టేటస్‌గా పెట్టుకోవచ్చు.లెక్కలేనన్ని ఫొటోలు, వీడియోలు వాట్సాప్ స్టేటస్‌లో అప్ లోడ్ అవుతూ ఉంటాయి.సాధారణంగా మన ఫ్రెండ్స్, బంధువుల్లో ఎవరైనా వాట్సాప్ స్టేటస్‌లో ఆకట్టుకునే వీడియోలు అప్‌డేట్‌ చేసినప్పుడు అవి డౌన్‌లోడ్ చేసుకోవాలని భావిస్తుంటాం.

 What's Up, New Features, New Updates, Technology Latest, Technology News, What's-TeluguStop.com

కానీ వాట్సాప్‌లో స్టేటస్ వీడియోలు డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఎలాంటి ఆప్షన్ లేదు.ఆ వీడియో కావాలంటే షేర్ చేయమని అడగడం తప్ప మరే ఇతర మార్గం లేదు.

అలాగని ప్రతిసారీ అడగడం కూడా కష్టమే.అయితే మీరు ఎవర్నీ అడక్కుండానే వాట్సాప్ స్టేటస్ డౌన్‌లోడ్ చెయ్యొచ్చు.

వాట్సాప్ లో స్టేటస్ డౌన్‌లోడ్ ఆప్షన్లు లేకపోయినప్పటికీ.గూగుల్ ఫైల్స్, స్టేటస్ సేవర్ యాప్స్ ద్వారా స్టేటస్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

స్టేటస్ డౌన్‌లోడ్ ఎలా చేయాలో తెలుసుకుంటే.

ప్లే స్టోర్ ద్వారా గూగుల్ ఫైల్‌ డౌన్‌లోడ్ చేసి ఆ యాప్ లోని మెనూపై నొక్కండి.సెట్టింగ్స్(Settings)లోకి వెళ్లి షో హిడెన్ ఫైల్స్(Show Hidden Files) అనే ఆప్షన్ టర్న్ ఆన్ చేయాలి.

మళ్లీ యాప్ నుంచి వెనుకకు వచ్చి దానిని రీలాంచ్ చేయాలి.తరువాత గూగుల్ ఫైల్స్ యాప్ లో హోం పేజీలో కనిపించే ఇంటర్నల్ స్టోరేజ్ ఫోల్డర్ పై క్లిక్ చేయండి.

ఇంటర్నల్ స్టోరేజ్ >వాట్సాప్ >మీడియా>స్టేటసెస్ ఇలా వరుసగా ఫోల్డర్స్ లోకి వెళ్ళండి.వాట్సాప్‌లో మీరు వ్యూ చేసిన అన్ని స్టేటస్‌ల ఫైల్స్ మీరు స్టేటసెస్ ఫోల్డర్ లో చూడొచ్చు.

ఇందులో మీకు నచ్చిన స్టేటస్ లేదా వీడియోను సెలెక్ట్ చేయండి.ఆ ఫొటోలు డౌన్‌లోడ్‌ చేసేందుకు లొకేషన్ సెలక్ట్ చేయండి.

ఆపై ఫైల్ సేవ్ చేయడానికి లాంగ్ ప్రెస్ చేస్తే.స్టేటస్ ఫొటో/వీడియో మీ ఫోన్ లోకల్ స్టోరేజ్ లో సేవ్ అయిపోతుంది.

Telugu Download, Ups, Latest, Whats Status, Whats-Latest News - Telugu

గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉన్న (Status Saver) స్టేటస్ సేవర్ అనే అప్లికేషన్ ద్వారా కూడా వాట్సాప్ స్టేటస్ వీడియోలు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.ఈ అప్లికేషన్ మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకొని వాట్సాప్ స్టేటస్ లో ఈజీగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube