కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు ప్రేక్షకుల్లో ఉన్న పాపులారిటీ అంతాఇంతా కాదు.పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం వల్ల బాధ పడి కొంతమంది అభిమానులు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.
ఎవరికీ అపకారం చేయకుండా మంచి మనస్సుతో సేవా కార్యక్రమాలు చేసి పునీత్ ఫ్యామిలీ ఈ స్థాయిలో అభిమానాన్ని చాటుకున్నారు.కార్డియాక్ అరెస్ట్ వల్ల పునీత్ చనిపోవడంతో ఆ సమస్య రాకుండా చాలామంది వైద్య చికిత్స, పరీక్షలు చేయించుకుంటున్నారు.
ఈరోజు పునీత్ దశ దిన కర్మకాండ జరగనుండగా ఇందుకు సంబంధించి ఫ్యామిలీ మెంబర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు.పునీత్ రాజ్ కుమార్ ఇంటి దగ్గర, కంఠీరవ స్టేడియం దగ్గర రెండు కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
‘అప్పు’ దశ దిన కర్మకాండ సందర్భంగా 2,000 మందికి పునీత్ రాజ్ కుమార్ కుటుంబం భోజనాలను వడ్డించనుందని తెలుస్తోంది.పునీత్ రాజ్ కుమార్ సమాధిని ప్రతిరోజూ వేల సంఖ్యలో ప్రజలు సందర్శిస్తున్నారు.
పునీత్ మరణం కొన్ని లక్షల మంది హృదయాలను బాధ పెట్టడం గమనార్హం.
మరోవైపు పునీత్ రాజ్ కుమార్ కు పద్మశ్రీ ఇవ్వాలంటూ కర్ణాటక మంత్రులు డిమాండ్ చేస్తున్నారు.గతంలోనే పునీత్ కు పద్మశ్రీ ఇచ్చి ఉంటే బాగుండేదని మరణానంతరం అయినా పునీత్ కు పద్మశ్రీ ఇవ్వాలని కర్ణాటక మంత్రులు అభిప్రాయపడుతున్నారు.పునీత్ వ్యక్తిగతంగా సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు మరణానంతరం కూడా సేవా కార్యక్రమాలను కొనసాగించారు.
పునీత్ రాజ్ కుమార్ 1800 మంది పేద విద్యార్థులను చదివించడంతో పాటు వృద్ధాశ్రమాలను, అనాథ ఆశ్రమాలను, ఉచిత పాఠశాలలను కొనసాగిస్తున్నారు.కన్నడ నాట సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న స్టార్ హీరోలలో పునీత్ ఒకరు కావడం గమనార్హం.పునీత్ రాజ్ కుమార్ కు ప్రేక్షకుల్లో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది.