ఇక్కడ అల్లు అర్జున్.. అక్కడ పునీత్.. ఆ విషయంలో ఇద్దరు నెంబర్ 1?

కన్నడ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా నిలిచిన పునీత్ రాజ్ కుమార్ మరణించాడన్న వార్త తెలియడంతో ఎంతోమంది అభిమానులు, సినీ ప్రముఖులు షాక్ కు గురయ్యారు.కేవలం కన్నడ ఇండస్ట్రీ లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా ఈయనకు మంచి అభిమానం ఉంది.

 Allu Arjun Here Puneet Raj Kumar There Both Are Number One In That Regard, Allu-TeluguStop.com

ఇక ప్రస్తుతం ఈయన గురించి సోషల్ మీడియాలో, వార్తలలో ఎన్నో విషయాలు ప్రసారమవుతున్నాయి.ఇదిలా ఉంటే ఓ విషయంలో అల్లు అర్జున్ తో సమానంగా ఉన్నాడు పునీత్.

ఇంతకు అది ఏంటో తెలుసుకుందాం.

తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి పునీత్ రాజ్ కుమార్ బాల నటుడుగా పరిచయమయ్యాడు.

అలా చిన్న వయసులోనే పలు సినిమాలలో నటించి తన నటనకు అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు.ఆ తర్వాత హీరోగా పరిచయమై ఎన్నో సినిమాలలో నటించాడు.అతి తక్కువ సమయంలో కన్నడ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా మారాడు.ఇక ఈయనకు ఎంతోమంది వీరాభిమానులు ఉన్నారు.

నటుడుగా ఎంత మంచి గుర్తింపు తెచ్చుకున్నాడో వ్యక్తిగతంగా కూడా అంతే మంచి పేరు సంపాదించుకున్నాడు.ఈయనకు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి అనుబంధం ఉంది.టాలీవుడ్ స్టార్ నటులతో కూడా మంచి పరిచయాన్ని పెంచుకున్నాడు.టాలీవుడ్ ఇండస్ట్రీకి ఈయన డబ్బింగ్ సినిమా ద్వారా పరిచయమయ్యాడు.

ఇక్కడ అభిమానుల హృదయాలను కూడా సంపాదించుకున్నాడు.

Telugu Allu Arjun, Heart Attack, Heavy Worokouts, Kannada, Puneet, Puneetraj, Re

సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటాడు పునీత్.తన సంబంధించిన ఫోటోలను, వర్క్ అవుట్ ల వీడియోలను బాగా పంచుకుంటాడు.అలా ఈయన జిమ్ లో చేసే వర్కౌట్ లు వీడియోలు చూస్తే మాత్రం మతి పోతుంది.

ఎందుకంటే చాలా కష్టమైన వర్కౌట్లు చేస్తూ ఉంటాడు.అలా రోజూ చేసే విధంగా నిన్న కూడా జిమ్ లో హెవీ వర్క్ అవుట్ చేస్తుండగా అకస్మాత్తుగా ఛాతి నొప్పి రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు.

Telugu Allu Arjun, Heart Attack, Heavy Worokouts, Kannada, Puneet, Puneetraj, Re

దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో మరణించాడు.ఈయన హాస్పిటల్ లో చేరిన సంగతి తెలిసిన వెంటనే ఎంతోమంది అభిమానులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, కుటుంబ సభ్యులు తరలివచ్చారు.కానీ మరణించాడని తెలియటంతో అందరు శోకసంద్రంలో మునిగిపోయారు.ఇక ఎంతో మంది అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.

Telugu Allu Arjun, Heart Attack, Heavy Worokouts, Kannada, Puneet, Puneetraj, Re

ఇదిలా ఉంటే ఈయనకు టాలీవుడ్ హీరోలతో కూడా పరిచయం ఉండటంతో వాళ్ల తో దిగిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి.కాకుండా ఆయన అల్లు అర్జున్ తో గతంలో దిగిన ఫోటో కూడా ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ గా మారింది.వీరిద్దరిలో కొన్ని విషయాలు చాలా వరకు సమానంగా ఉన్నాయి అంటూ అభిమానులు తెలుపుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube