కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతి పట్ల దేశ వ్యాప్తంగా తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం అవుతోంది.టాలీవుడ్ కు పునీత్ రాజ్ కుమార్ కు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
ఇప్పటికే పునీత్ రాజ్ కుమార్ మృతి పట్ల పలువురు టాలీవుడ్ దిగ్గజాలు సోషల్ మీడియా ద్వారా సంతాపంను తెలియజేశారు.నేడు బెంగళూరులో జరుగబోతున్న అంత్యక్రియలకు కూడా పాల్గొనబోతున్నారు.
ఎన్టీఆర్ ఇప్పటికే బెంగళూరు వెళ్లేందుకు సిద్దం అయ్యాడు.పునీత్ రాజ్ కుమార్ అంటే ఎన్టీఆర్ కు ప్రత్యేకమైన అభిమానం ఉంది.
ఆ అభిమానంతోనే గతంలో ఎన్టీఆర్ స్వయంగా పునీత్ రాజ్ కుమార్ సినిమా లో ఒక పాట పాడటం జరిగింది.కన్నడం లో ఎన్టీఆర్ కష్టపడి పాట పాడాడు అంటూ వార్తలు వస్తున్నాయి.
ఆ సమయంలోనే ఇద్దరి స్నేహం గురించి చాలా మంది చాలా రకాలుగా ప్రచారం చేశారు.ఇప్పుడు పునీత్ మృతి చెందిన సమయంలో కూడా ఇద్దరి బందం గురించి ప్రముఖంగా మీడియాలో కథనాలు వచ్చాయి.థమన్ సంగీతం అందించిన పునీత్ రాజ్ కుమార్ సినిమా కు గాను ఎన్టీఆర్ తన గాత్రంను అందించాడు.పునీత్ వంటి స్నేహితుడిని కోల్పోయినందుకు గాను వెళ్లి అతడి అంత్యక్రియల్లో పాల్గొని కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేయాలని ఎన్టీఆర్ భావిస్తున్నాడు.
చివరి చూపు కు ఎన్టీఆర్ వెళ్తున్నాడు.ఎన్టీఆర్ తన ఆప్తుడిని కోల్పయాను అంటూ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది.ఎన్టీఆర్ కన్నడ ప్రేక్షకులకు ఇప్పటికే సన్నిహితుడు.ఇప్పుడు తమ అభిమాన నటుడు పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలకు వెళ్లినందుకు గాను మరింతగా వారి మనసులో స్థానం సంపాదించుకోవడం ఖాయం.
ఎన్టీఆర్ ఇటీవలే ఎవరు మీలో కోటీశ్వరులు షో ను ముగించాడు.విదేశాలకు వెళ్లేందుకు రెడీ అవుతున్న ఎన్టీఆర్ కు ఈ షాకింగ్ న్యూస్ తెలిసి.
బెంగళూరు వెళ్లబోతున్నాడు.