బీజేపీపై టీఆర్ఎస్ నేతల సంచలన వ్యాఖ్యలు...బీజేపీ అలా చేయనుందా?

తెలంగాణ రాష్ట్రంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.

అయితే ప్రస్తుతం పోటీ చేస్తున్న ప్రధాన పార్టీలు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లు గెలుపు వ్యూహాలను రచిస్తున్న పరిస్థితి ఉంది.

అయితే ప్రస్తుతం భీకర పోటీ బీజేపీ, టీఆర్ఎస్ మధ్య నెలకొంది.ఇటు రాష్ట్ర ప్రజలు, విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు సైతం హుజూరాబాద్ ఫలితం కొరకు వేచి చూస్తున్నారంటే ఉప ఎన్నిక  ఎంత మేర చర్చనీయాంశంగా మారిందో ఎంతగా ఆసక్తి నెలకొందో మనం అర్థం చేసుకోవచ్చు.

అయితే ప్రస్తుతం ఇటు బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు దొరికిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ ప్రత్యర్థి పార్టీపై ప్రజల్లో వ్యతిరేకతను పెంచే వ్యూహాలను పన్నుతున్నారు.అయితే ఇక పోలింగ్ కు ఒకటే రోజు మిగిలి ఉన్న తరుణంలో బీజేపీ పై టీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి.

టీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఒకసారి పరిశీలిస్తే బీజేపీ నేతలు ఎన్నికలలో గెలుపు కోసం ఎంతకైనా తెగబడుతారని అందుకే ఈ ఎన్నికల్లో కార్యకర్తలు ఆత్మహత్యాయత్నం  లాంటి ఘటనలకు పాల్పడి సానుభూతి పొంది ఎన్నికలో గెలుపొందాలని బీజేపీ ప్రయత్నాలు చేయబోతున్నదని, కావున ప్రజలెవరూ అవన్నీ నమ్మవద్దని టీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది.

Advertisement

అయితే  టీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యల పట్ల బీజేపీ నేతలు ఇంకా స్పందించలేదు.ఏది ఏమైనా టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒకరికొకరు విమర్శలు ప్రతి విమర్శలతో రాజకీయాల్ని హీటెక్కిస్తున్న పరిస్థితి ఉంది.మరి అక్టోబర్ 30 న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో పార్టీలు ఇక చివరి ప్రయత్నాల్లో నిమగ్నమయి ఉన్నాయి.

మరి హుజూరాబాద్ పీఠం దక్కించుకునేదెవరనేది తెలియాలంటే నవంబర్ రెండవ తారీఖు వరకు వేచి చూడాల్సిందే.

Advertisement

తాజా వార్తలు