తెలుగు సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.ఎన్నో సినిమాలలో తన అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సినీ నటుడు రాజబాబు కన్నుమూశారు.
కేవలం వెండితెరపై మాత్రమే కాకుండా బుల్లితెర ప్రేక్షకులను సందడి చేసిన రాజబాబు గత కొద్దికాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు.ఈ క్రమంలోనే ఆదివారం ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు.
రాజబాబు మృతి చెందారన్న విషయం తెలుసుకున్న పలువురు సినీ సెలబ్రిటీలు ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు.తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రాజబాబు చిన్నప్పటినుంచి నటనపై ఆసక్తి ఉండడంతో ఎన్నో నాటకాలు వేస్తూ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు.1995వ సంవత్సరంలో ఊరికి మొనగాడు అనే సినిమా ద్వారా తెలుగు తెరకు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.
ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో సుమారు 62 చిత్రాలలో నటించిన రాజబాబు బుల్లితెరపై వసంత కోకిల, బంగారు పంజరం, చి ల సౌ స్రవంతి, మనసు మమత వంటి సీరియల్స్ లో నటించారు.
అమ్మ సీరియల్ లో నటించిన అందుకుగాను 2005వ సంవత్సరంలో రాజబాబు నంది అవార్డును కూడా అందుకున్నారు.ఇలా ఎన్నో సినిమాలలో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న రాజబాబుకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు.