పుట్టుకతోనే నాకు ఆ సమస్య ఉంది.. జెస్సి ఎమోషనల్?

బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ ల మధ్య నిత్యం ఏదో గొడవలు, పోట్లాటలు, తగాదాలకు ఏ మాత్రం కొదువ లేదని చెప్పవచ్చు.అప్పటి వరకు ఎంతో సరదాగా కలిసి మాట్లాడుతున్న కంటెస్టెంట్ లు బిగ్ బాస్ నిర్వహించే టాస్క్ విషయానికి వచ్చేసరికి అందులో గెలవాలని కంటెస్టెంట్ ల మధ్య తీవ్ర పోటీ నెలకొని పెద్ద ఎత్తున గొడవలు పడతారు .

 Bigg Boss Telugu 5 Promo Bb5 Housemates Share Their Memories, Bigg Boss Telugu 5-TeluguStop.com

అయితే ఇలా గొడవలు పడుతున్న కంటెస్టెంట్ లు అప్పుడప్పుడు ఎమోషనల్ అవుతూ వారి వ్యక్తిగత విషయాలను తెలుపుతున్నారు.

ఈ క్రమంలో కంటెస్టెంట్ లు వారి వ్యక్తిగత విషయంలో ఎదుర్కొన్న సమస్యలు బాధలను గురించి తెలిపారు.

ఈ క్రమంలోనే సన్నీ మాట్లాడుతూ కేవలం తన తల్లి ఒంటరిగా ముగ్గురు అబ్బాయిలను ఎంతో కష్టపడి పెంచిందనీ, అలా పెంచడం ఎంత కష్టమో తనకు తెలుసు అంటూ తెలిపారు.ఇక మోడల్ జశ్వంత్ మాట్లాడుతూ తనకు చిన్నప్పటి నుంచి గొంతు సమస్య వచ్చిందని అయితే అది పుట్టుకతోనే రావడం వల్ల తన మాట స్పష్టంగా ఉండదని ఈ సందర్భంగా తెలిపారు.

అయితే తనకు గొంతు సమస్య ఉన్నప్పటికీ తాను ఎన్నో నేషనల్ అవార్డులను గెలుచుకున్నానని, ఫ్యాషన్ ఐకాన్ గా, గిన్నిస్ బుక్ రికార్డు సాధించానని ఇప్పటికి కూడా మా అమ్మ నా కొడుకు మోడల్ అంటూ ఎప్పుడు బయట చెప్పుకోదు అంటూ జశ్వంత్ ఎంతో ఎమోషనల్ అయ్యారు.ఇలా హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ అందరూ కూడా వారి గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube