అచ్చెన్న ఆగ్రహం : అందరి పేర్లూ రాసుకుంటాం .. అధికారంలోకి వచ్చాక..?

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు వైసిపి ప్రభుత్వంపైన ,పోలీసుల వ్యవహార శైలిపైనా తీవ్ర తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.వైసీపీ శ్రేణులు టిడిపి కార్యాలయం పై చేసిన దాడులకు నిరసనగా టిడిపి ఆధ్వర్యంలో ఈరోజు వైసిపి ఉగ్రవాదంపై పోరు దీక్షలో అచ్చెన్న ప్రసంగించారు.

 Achhennaidu Sensational Comments On Jagan Achhennayidu, Tdp, Ap Presindent, Cbn-TeluguStop.com

ఈ సందర్భంగా సంచలన విమర్శలు ఆయన చేశారు.వైసిపి ప్రభుత్వ గుండాలు రౌడీలతో కొంతమంది పోలీసులు కుమ్మక్కయ్యారని విమర్శించారు.

తనను వేధిస్తున్న వైసీపీ నేతలు,  పోలీసు అధికారులు జాబితాను తాము రాసుకుంటున్నాము అని, అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సంగతి చూస్తామంటూ అచ్చెన్న వార్నింగ్ ఇచ్చారు.వైసీపీ ప్రభుత్వం తప్పులను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అంటూ ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు.

వైసీపీ నేతలు బూతులు మాట్లాడటం లేదని ముఖ్యమంత్రి అంటున్నారని,  ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఏం మాట్లాడారో ఇప్పుడు వైసీపీ మంత్రులు నేతలు ఏం మాట్లాడుతున్నారో గుర్తించుకోవాలి అంటూ హితబోధ చేశారు.

       చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చాలి , చీపుర్లతో కొట్టాలని జగన్ అన్నారా లేదా అని ఆయన ప్రశ్నించారు.

జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య,  కోడి కత్తి కేసు చంద్రబాబు, లోకేష్, టిడిపికి ఆపాదించి లబ్ధి పొందాలని వైసిపి చూసిందని , ఆ పార్టీ ఎన్ని అరాచకాలు చేసినా, టిడిపి కార్యకర్తలు ధైర్యంగా రక్షణ కవచంలా పార్టీని కాపాడుకొచ్చారు అంటూ చెప్పుకొచ్చారు.
   

Telugu Achhennayidu, Ap Cm, Ap, Jagan-Telugu Political News

   వైసీపీ చేసిన అరాచకాలు  తాము అధికారంలో ఉన్నప్పుడు ఒక శాతం మేము చేసి ఉంటే  వారి పరిస్థితి ఎలా ఉండేదో తెలుసుకోవాలని హితవు పలికారు తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయాలని జగన్ అంటున్నారని, కానీ అది జగన్ తండ్రి , తాత వల్ల కూడా కాలేదు అని, ఇక జగన్ వల్ల ఏమవుతుంది అంటూ ఎద్దేవా చేశారు.  జగన్ పై విమర్శలు చేసిన పట్టాబిని పట్టుకుని అరెస్టు చేశారని, కానీ ఆయన ఇంటిపై దాడి చేసిన వారిని ఇప్పటివరకు అరెస్టు చేయకపోవడం చూస్తుంటే పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారనే విషయం అందరికీ అర్థమవుతోందని అచ్చెన్న తనదైన శైలిలో పోలీసుల పైన, వైసిపి ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube