తెలుగు ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్ చిన్మయి ఈ మధ్య కాలంలో తన పాటలతో మాత్రమే కాకుండా అప్పుడప్పుడు పలు వివాదాలతో కూడా ప్రేక్షకులని పలకరిస్తోంది.కాగా ఈ మధ్య కాలంలో సింగర్ చిన్మయి సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు సమాజంలో జరుగుతున్న సంఘటనల గురించి స్పందించడమే కాకుండా తనకు తోచినంత సహాయం కూడా చేస్తోంది.
అయితే తాజాగా సింగర్ చిన్మయి కి సోషల్ మీడియా మాధ్యమాలలో చేదు అనుభవం ఎదురైంది.కాగా ఇటీవల సింగర్ చిన్మయి ఓ ఫోటోని తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయడంతో ఓ నెటిజన్ అసభ్యకర పదాన్ని ఉపయోగిస్తూ కామెంట్ చేశాడు.
దీంతో ఈ విషయంపై సింగర్ చిన్మయి స్పందిస్తూ నెటిజన్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇందులో భాగంగా మగవాళ్ళు మహిళలని తిట్టడానికి అసభ్యకరమైన పదజాలం ఉపయోగిస్తారని అయితే ఈ అసభ్యకర పదజాలం ఒక్కో భాషలో ఒక్కో రకంగా ఉంటుందంటూ వివరణ ఇచ్చింది.
అంతేకాకుండా ఈ మధ్య కాలంలో మహిళలని కేవలం పడక సుఖం పంచితేనె మంచి వాళ్ళుగా చూస్తున్నారని లేకపోతే చాలా హీనంగా చూస్తున్నారని చెప్పుకొచ్చింది.కరోనా వైరస్ విజృంభించిన సమయంలో కొంతమంది తల్లిదండ్రులు తమ ఆడ పిల్లలని డబ్బు కోసం అమ్మేశారని దీంతో ఎక్కువ మంది ఆడపిల్లలు వ్యభిచార కూపంలోకి బలవంతంగా లాగబడుతున్నారని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
కొందరైతే ఏకంగా వ్యభిచారం చేసే మహిళలతో పనులు చేయించుకుంటూ ఏదో వారిని ఉద్ధరించినట్లు ప్రవర్తిస్తున్నారని ఇది సరికాదని తెలిపింది.అంతేకాకుండా వ్యభిచారం చేసే మహిళలు సిగ్గు పడాల్సిన అవసరం లేదని వారికి ఎలాంటి పని దొరక్క, తిండి లేని సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని అంతేతప్ప కావాలని ఏ మహిళ కూడా వ్యభిచార కూపంలోకి తనకి తానుగా దిగదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
అలాగే ఎప్పుడూ కూడా మహిళ యొక్క గౌరవం ఆమె యోనిలో ఉండదని అలాగే యోని కూడా తన శరీరంలోని ఇతర శరీర భాగాల మాదిరిగానే ఒక శరీర భాగమని అంతే తప్ప తమ జననాంగాలని బట్టి మహిళకి ఎలాంటి గౌరవం ఉండదని ఆ విషయం తెలుసుకుంటే మంచిదని సంచలన వ్యాఖ్యలు చేసింది.ఇక దేశ వ్యాప్తంగా వ్యభిచార గృహాలు నిర్వహించే వాళ్ళలో ఎక్కువగా మగవాళ్లే ఉన్నారని అలాంటప్పుడు వ్యభిచారంలో కేవలం ఆడవాళ్ళకు మాత్రమే సంబందించిన విషయమని నిందించటం సరికాదని చెప్పుకొచ్చింది.