తెలుగులో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన “లీడర్” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయమైన తెలుగు ప్రముఖ దర్శకుడు హీరో “రానా దగ్గుబాటి” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే రానా దగ్గుబాటి వచ్చీరావడంతోనే తన మొదటి చిత్రంతో ప్రేక్షకులని బాగానే ఆకట్టుకున్నాడు.
దీంతో సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ తన నటనా ప్రతిభను నిరూపించుకుని తనకంటూ కొద్ది మంది అభిమానులను సంపాదించుకున్నాడు.అయితే ఇప్పటివరకు రానా దగ్గుబాటి తన సినీ కెరీర్లో కేవలం హీరోగా మాత్రమే కాకుండా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి ప్రేక్షకులని బాగానే అలరించాడు.
ఆ మధ్య ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన “బాహుబలి” చిత్రంలో విలన్ పాత్రలో నటించి ఎంతగానో ఆకట్టుకున్నాడు.
అయితే రానా దగ్గుబాటి బాలీవుడ్ సినిమా పరిశ్రమలో పలు చిత్రాలలో గెస్ట్ అప్పియరెన్స్ పాత్రలలో కూడా నటించి అటు బాలీవుడ్ సినీ టౌన్ లో కూడా ప్రేక్షకులకు సుపరిచితమయ్యాడు.తాజాగా హీరో రానా దగ్గుబాటి కి సంబంధించినటువంటి ఓ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అయితే ఇంతకీ ఆ విషయం ఏమిటంటే అప్పట్లో టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ సినీ దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రంలో హీరోగా నటించడానికి ఒప్పుకున్నాడని ఈ క్రమంలో సగానికి పైగా షూటింగ్ కూడా చిత్ర యూనిట్ సభ్యులు పూర్తి చేశారని కానీ మధ్యలో ఈ చిత్ర సినీ నిర్మాతలు కలగజేసుకుని స్క్రిప్టు పనుల్లో వేలు పెట్టడంతో రానా దగ్గుబాటి కి నచ్చలేదట.దాంతో నిర్మాతలకి మరియు రానా దగ్గుబాటి కి మధ్య కొంతమేర బేధాభిప్రాయాలు రావడంతో వెంటనే రానా దగ్గుబాటి ఆ చిత్రం నుంచి తప్పుకున్నాడని దాంతో ఈ సినిమా షూటింగ్ పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయట.
ఆ తర్వాత ఈ చిత్రాన్ని టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందినటువంటి ఓ ప్రముఖ హీరోతో షూటింగ్ పూర్తి చేసేందుకు యత్నించినప్పటికీ వర్కౌట్ కాకపోవడంతో దర్శకనిర్మాతలు కూడా వదిలేశారని టాక్ వినిపిస్తోంది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రానా దగ్గుబాటి తెలుగులో తెలుగు ప్రముఖ దర్శకుడు వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.ఈ చిత్రంలో రానా దగ్గుబాటి తెలుగు హీరోయిన్ సాయి పల్లవి నటిస్తోంది ఆ మధ్య ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల కాగా మంచి స్పందన లభించింది.ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు పూర్తి అయినట్లు సమాచారం.
దాంతో ప్రస్తుతం రానా దగ్గుబాటి తెలుగులో భీమ్లా నాయక్ అనే చిత్రంలో మెయిన్ లీడ్ పాత్రలో నటిస్తున్నాడు.