రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V.శ్రీనివాస్ గౌడ్ గారు హైదరాబాద్ లోని తన కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సారధ్యంలో రూపొందించిన బతుకమ్మ పాటలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీ V.శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ…బతుకమ్మ పండుగ ప్రకృతిని అరాధించే పెద్ద పండుగ అన్నారు.ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర పండుగ గా గుర్తించి ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు.అక్టోబర్ 6 నుండి 13 వ తేది వరకు 9 రోజుల పాటు మహిళలు, ప్రభుత్వ ఉద్యోగిణిలు బతుకమ్మ వేడుకలను నిర్వహించుకోవడానికి ప్రభుత్వ కార్యాలయాల్లో సంబరాలు జరుపుకునెందుకు అనుమతి ఇచ్చామన్నారు.
తెలంగాణ ఉద్యమం లో బతుకమ్మ సంబరాలు ఎంతో ఉత్సాహన్నీ ఇచ్చాయన్నారు.జాగృతి సంస్థ అధ్యక్షురాలు, MLC కవిత గారి నేతృత్వంలో ప్రపంచ వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు విస్తరించాయన్నారు.
తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను రాష్ట్ర వ్యాప్తంగా, అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు.తెలంగాణ రాష్ట్రం లో మహిళల రక్షణకు పెద్ద పీట వేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి KS శ్రీనివాస రాజు, TGO కేంద్ర సంఘం అధ్యక్షురాలు శ్రీమతి మమత, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ జాయింట్ సెక్రెటరీ K.రమేష్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, పలువురు నటీనటులు పాల్గొన్నారు.MM శ్రీలేఖ సంగీతం అందించిన ఈ బతుకమ్మ పాటలకు సింగర్స్ శృతి, వీణా, సితార నవీన్, నాగదుర్గ ఆడి పాడారు.