ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా గ్లామర్ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. ఈ సినిమాపై అభిమానులు ఎంతగానో అంచనాలు పెట్టుకున్నారు.
ఇది పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుండడంతో మన టాలీవుడ్ ప్రేక్షకులే కాకుండా మిగతా ఇండస్ట్రీ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం పుష్ప.
ఇందులో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లర్ గా నటిస్తున్నాడు.
ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదల అయినా టీజర్, పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.ఇక ఇటీవలే చిత్ర యూనిట్ రష్మిక లుక్ కూడా రివీల్ చేసారు.
దీంతో పుష్పరాజ్ కు తగ్గట్టుగా రష్మిక కూడా మాస్ పాత్రలో అదరగొడుతుందని అందరికి అర్ధం అయ్యింది.
ఇక ఈ సినిమా క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని మేకర్స్ ఎప్పుడో అనౌన్స్ చేసారు.

కానీ ఈ మధ్య ఈ సినిమా వాయిదా పడుతుందని అనుకున్న డేట్ కు రిలీజ్ అవ్వదని పలు ఊహాగానాలు వినిపించాయి.దీంతో ఈ విషయంపై మేకర్స్ మరొకసారి స్పందించి వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టారు.అంతేకాదు రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసారు.

ఈ సినిమాను డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టు మరొకసారి చిత్ర యూనిట్ స్పష్టం చేయడంతో అనుకున్న సమయానికే పుష్ప సినిమా వస్తుందని ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.పుష్పరాజ్ అభిమానులు తగ్గేదే లే అంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.ఇక ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.