ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా మాధ్యమాలు అందరికీ అందుబాటులోకి రావడంతో కొందరు సినీ సెలబ్రిటీలు వీటిని ఉపయోగించుకొని బాగానే పబ్లిసిటీ పెంచుకుంటున్నారు.మరికొందరైతే సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ బాగానే పాపులర్ అవుతున్నారు.
కాగా తెలుగులో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వంగవీటి చిత్రంలో హీరో భార్య పాత్రలో నటించి బాగానే ఆకట్టుకున్న యంగ్ హీరోయిన్ “నైనా గంగూలీ” కూడా ఈ కోవకే చెందుతుంది.అయితే ఈ అమ్మడు తెలుగులో నటించింది తక్కువ చిత్రాల్లోనే అయినప్పటికీ తన బోల్డ్ ఫోటోలు మరియు వీడియోలను విడుదల చేస్తూ టాలీవుడ్ సినీ ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంటోంది.
అయితే తాజాగా నైనా గంగూలీ తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసిన ఓ వీడియో ద్వారా మరో మారు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.ఇంతకీ ఆ వీడియో లో ఏముందంటే నటి నైనా గంగూలీ తన లోదుస్తులు కనిపించే విధంగా దుస్తులు ధరించి సిగరెట్ తాగుతూ చాలా హాట్ గా దర్శనమిచ్చింది.
దీంతో ప్రస్తుతం ఈ వీడియో జగన్ వైరల్ అవుతుంది దీనికితోడు తెలుగు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఈ వీడియోని తన అధికారిక సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేస్తూ హైలెట్ చేశాడు.దీంతో ప్రస్తుతం నటి నైనా గంగూలీ గురించి కొందరు నెటిజన్లు చాలా బోల్డ్ గా కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఈమధ్య నటించిన “నైనా గంగూలీ” కేవలం చిత్రాలలో మాత్రమే కాకుండా పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.కాగా తాజాగా ఈ అమ్మడు బెంగాలీ భాషలో విడుదలైన “చరిత్ర హీన్ 3” అనే వెబ్ సీరీస్ లో మెయిన్ లీడ్ పాత్రలో నటించింది.కాగా ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ “ఎంఎక్స్ ప్లేయర్” లో ప్రసారం అవుతోంది.అలాగే నటి “నైనా గంగూలీ” బాలీవుడ్ లో “బ్యూటిఫుల్: ది ఆర్ట్ ఆఫ్ రంగిలా” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.