హరీష్ రావు అనుచరుల బాధ ఏంటి ? 

టిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు, ప్రాధాన్యత పొందారు మంత్రి హరీష్ రావు.టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం నిరంతరం కష్టపడటమే కాకుండా, కేసీఆర్ వెన్నంటి నడవడం, ఆయన ఆదేశాలను తు.

 Harish Rao Fans Who Are Worried That Harish Raos Prominence In- Rs Is Declining-TeluguStop.com

చ తప్పకుండా పాటిస్తూ, పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు , తెలంగాణ సాధించేందుకు తన శక్తికి మించి కష్టపడిన నాయకుడిగా హరీష్ రావు కు గుర్తింపు ఉండేది.ఇక కేసీఆర్ సైతం ఆయనకు అంతే స్థాయిలో ప్రాధాన్యం ఇచ్చేవారు.

కానీ ఎప్పుడైతే కేసీఆర్ కుమారుడు కేటీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారో, అప్పటి నుంచి క్రమక్రమంగా హరీష్ ప్రాధాన్యత తగ్గుతూ వస్తోంది.అయినా హరీష్ తో పాటు,  ఆయన అనుచరులు సర్దుకుపోతూ వస్తున్నారు.

         ప్రస్తుతం హుజురాబాద్ ఎన్నికల బాధ్యతలు మొత్తం హరీష్ రావు పైనే కేసీఆర్ పెట్టారు.అక్కడ టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలిచినా, ఓడినా, ఆ ప్రభావం పూర్తిగా హరీష్ రావు పైనే ఉంటుంది.

అంతే కాకుండా, ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ప్రచారం అవుతున్న ఈటెల రాజేందర్ తో హరీష్ రావు కు సన్నిహిత సంబంధాలు ఉండడంతో,  రాజేందర్ పై విమర్శలు చేయించేందుకు హరీష్ రావు కి కేసీఆర్ బాధ్యతలు అప్పగించారు.ఇదే కరీంనగర్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేటీఆర్ కు ఈ బాధ్యతలు అప్పగించకుండా, హరీష్ రావు ముందు పెట్టడం వెనుక రాజకీయాల ఉందనేది హరీష్ రావు అనుచరుల బాధ.   

Telugu Etela Rajender, Gellusrinivas, Hareesh Rao, Telangana Cm, Trs-Telugu Poli

  ఈ వ్యవహారాలతో హరీష్ రావు తీవ్రంగా ఒత్తిడికి గురవుతున్నారని వారు వాపోతున్నారు.ప్రస్తుతం హరీష్ రావు ఈ నియోజక వర్గం పైనే దృష్టి పెట్టి ప్రతి పల్లెకు తిరుగుతూ, ఓటర్లను కలుస్తూ టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నారు.హరీష్ రావు వంటి నాయకుడిని ఈ విధంగా గల్లీకి పరిమితం చేయడం, ఒకవైపు తెలంగాణలో బీజేపీ పై తీవ్రస్థాయిలో విమర్శలు టిఆర్ఎస్ చేస్తూనే,  మరోవైపు కేంద్ర బీజేపీ పెద్దలను కేసీఆర్ కలుస్తూ వారిని ప్రశంసిస్తూ వస్తుండడం, మరింత ఇబ్బందికరంగా మారింది.ఒకవైపు తెలంగాణ బిజెపి ని విమర్శిస్తూ,  హుజూరాబాద్ లో టిఆర్ఎస్ ప్రాధాన్యం పెంచేందుకు హరీష్ రావు ప్రయత్నిస్తుండగా, మరోవైపు కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా తో పాటు, ఇతర మంత్రులు కలుస్తూ ప్రశంసలు కురిపిస్తూ ఉండడం తో జనాల్లో హరీష్ చులకన అవుతున్నారని, ప్రజలు కూడా హరీష్ విమర్శలను నమ్మడం లేదని, ఈ విధంగా హరీష్ ప్రాధాన్యత తగ్గిస్తున్నారు అనేది ఆయన అనుచరుల బాధకు కారణం.

ఒకవేళ ఈ నియోజకవర్గంలో ఎన్నికల ఫలితాలు తేడా కొడితే, దాన్ని సాకుగా చూపించి హరీష్ ప్రాధాన్యం మరింతగా తగ్గిస్తారు అని ,ఒక వ్యూహం ప్రకారం తమ నాయకుడిని పక్కన పెట్టే ప్రయత్నాలు పార్టీలో చోటుచేసుకుంటున్నాయి అంటూ హరీష్ అనుచరులు హైరానా పడిపోతున్నారు.   

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube