టాలీవుడ్ హీరోలలో ఒకరైన సాయి ధరమ్ తేజ్ కేబుల్ బ్రిడ్జి దగ్గర జరిగిన ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన సంగతి తెలిసిందే.ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో సాయి ధరమ్ తేజ్ చికిత్స చేయించుకుంటున్నారు.
వెంటిలేటర్ పై సాయి ధరమ్ తేజ్ చికిత్స పొందుతున్నాడని 48 గంటల వరకు అబ్జర్వేషన్ లో ఉంచుతామని వైద్యులు చెబుతున్నారు.సాయి ధరమ్ తేజ్ కు ఎటువంటి ఆపరేషన్ అవసరం లేదని వైద్యులు వెల్లడించారు.
అయితే పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేశారు.రాత్రి 8 గంటల 5 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు.పోలీసులు ఐపీసీ 184, 336 మోటార్ వాహనాల యాక్ట్ కింద నిర్లక్ష్యంగా వాహనం నడిపాడని, ర్యాష్ డ్రైవింగ్ చేశాడని కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది.సీసీ ఫుటేజీని ఆధారంగా చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తుండటం గమనార్హం.108 సిబ్బంది ప్రమాదం గురించి పోలీసులకు తెలియజేసినట్లు తెలుస్తోంది.
సాయి ధరమ్ తేజ్ కు కన్ను, పొట్ట, ఛాతీ భాగాలలో గాయాలు అయ్యాయని సమాచారం.
ముగ్గురు డాక్టర్లతో కూడిన వైద్య బృందం సాయి ధరమ్ తేజ్ కు చికిత్స అందిస్తోంది.సాయి ధరమ్ తేజ్ కు ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారని అల్లు అరవింద్ మీడియాకు తెలిపారు.
మొదట మెడికవర్ ఆస్పత్రిలో సాయి ధరమ్ తేజ్ కు చికిత్స జరగగా ఆ తర్వాత జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రికి సాయి ధరమ్ తేజ్ ను తరలించారు.