అవకాశాల కోసం చెన్నై కి ట్రైన్ లో జనరల్ బోగీలో ప్రయాణించేవాడిని..

తెలుగులో ఎన్నో విలన్ పాత్రలలో నటించి తన విలనిజంతో ప్రజలను ఎంతగానో భయ పెట్టిన టాలీవుడ్ ప్రముఖ వెటరన్ విలన్ “సత్య ప్రకాష్” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.కాగా నటుడు సత్య ప్రకాష్ స్వతహాగా కర్ణాటక సినీ పరిశ్రమకు చెందిన నటుడు అయినప్పటికీ టాలీవుడ్ సినిమా పరిశ్రమలో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

 Telugu Veteran Villain Sathya Prakash About His Struggles In Career Staring Stag-TeluguStop.com

అంతేకాకుండా తెలుగులో దాదాపుగా రెండు వందల కుపైగా చిత్రాలలో విలన్ పాత్రలలో నటించి ఎంతగానో మెప్పించాడు.కాగా తాజాగా నటుడు సత్య ప్రకాష్ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.

ఇందులో భాగంగా తాను సినిమా పరిశ్రమకు వచ్చిన కొత్తలో ఇక్కడ నటీనటులు ఎవరో తెలియక పోవడంతో అవకాశాల విషయంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపాడు.అంతేకాకుండా చిన్న చిన్న వేషాలకోసం కూడా తరచూ హైదరాబాద్ నుంచి చెన్నైకి జనరల్ బోగీలో ప్రయాణించేవాడినని చెప్పుకొచ్చాడు.

అలాగే తను కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతానని మన నిజ జీవితంలో మంచి చేసినా, చెడు చేసినా ఖచ్చితంగా మనకి తిరిగి వస్తుందని అలాంటప్పుడు ఇతరులకు చెడు చేయడం కన్నా మంచి చేయడం వల్లే మంచి ఫలితాలు ఉంటాయని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.ఇక సినిమా పరిశ్రమలో తనకు పెద్దగా స్నేహితులు ఎవరూ ఉండరని తాను కూడా సినిమా షూటింగ్ అయిపోగానే తన పని తాను చూసుకుని ఇంటికి వెళ్లిపోతానని అందువల్లనే తనకి పెద్దగా స్నేహితులు ఉండరని చెప్పుకొచ్చాడు.

Telugu Sathya Prakash, Struggles, Teluguveteran, Tollywood-Movie

ఇక టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి అంటే తనకు చాలా ఇష్టమని అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కి నాన్న గా నటించే అవకాశం వస్తే ఖచ్చితంగా నటిస్తానని తన మనసులో మాటని బయట పెట్టాడు.అంతే కాకుండా చిన్నప్పుడు రామ్ చరణ్ ని స్కూల్ నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు తన బైక్ మీద తీసుకెళ్లేవాడినని అప్పటి జ్ఞాపకాలను గర్తు చేసుకున్నాడు.ఇక సినిమా పరిశ్రమలో తనకు కొంత మేర సన్నిహితులు ఉన్నప్పటికీ తాను ఎప్పుడూ కూడా అవకాశాల కోసం ఎవరి దగ్గర చేయిచాచి అడగలేదని అలాగే తనకు భగవంతుడు ఇచ్చిన వాటితో చాలా సంతృప్తిగా ఉన్నానని తెలిపాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube