చేప ప్రాణాలు కాపాడిన కుక్క.. వైరల్ వీడియో.. చూస్తే నవ్వుకుంటారంతే..!

బర్డ్స్, యానిమల్స్‌కు సంబంధించిన వీడియోస్ చూస్తే ఎవరైనా చాలా ఇష్టపడుతుంటారు.వాటిని చూస్తే మానసిక ఉల్లాసం కూడా కలుగుతుందని పెద్దలు చెప్తుంటారు.

 The Dog That Saved The Lives Of The Fish Viral Video If You Watch It You Will La-TeluguStop.com

ఇకపోతే యానిమల్స్, బర్డ్స్‌కు సంబంధించిన బోలెడన్ని వీడియోలు నెట్టింట వైరలవుతుండటం మనం చూడొచ్చు.తాజాగా చేప కోసం పరితపిస్తున్న డాగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

వీడియో చూసి విశ్వాసానికి మాత్రమే కాకుండా ప్రేమకు కూడా ప్రతీకగా డాగ్ నిలుస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.వైరలవుతున్న సదరు వీడియోలో కుక్క చేపను కాపాడటానికి ప్రయత్నిస్తుండటం విశేషం.

వీడియోలో ఓ వ్యక్తి రోడ్డు పక్కన కూర్చొని కాలువలోని చేపలకు గాలం వేస్తున్నాడు.అతడితో పాటు డాగ్ కూడా ఉంది.

ఈ క్రమంలోనే సదరు వ్యక్తి చేపను పట్టి పక్కన ఉన్న డబ్బాలో వేశాడు.ఇంతలోనే కుక్క డబ్బా వద్దకు వెళ్లి చూసింది.

చేప గిలగిల కొట్టుకోవడాన్ని గమనించిన కుక్క.చేప ప్రాణం కోల్పోతుందని గ్రహించిందో ఏమో తెలియదు కానీ, వెంటనే ఆ డబ్బా(టబ్)ను కాలువలోకి నెట్టేసింది.

అలా చేప ప్రాణం తిరిగి ఇచ్చేసింది కుక్క.ఈ క్రమంలోనే సదరు వ్యక్తి మళ్లీ డబ్బాను తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా కుక్క అతడిని అడ్డగించడం గమనార్హం.

ఈ వీడియో నెటిజన్ల మనసును దోచేసుకుంది.విశ్వాసానికి ప్రతీక అయిన కుక్క చాలా మంచి పని చేసింనది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.ఫిష్ ఫ్రెండ్ డాగ్ అని మరి కొందరు అంటున్నారు.అసలు చేపకు సాయం చేయాలనే ఈ డాగ్‌కు ఎలా వచ్చిందో వీడియో చూసి మరికొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

ఇకపోతే ఇటీవల కాలంలో జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ సందడి చేస్తుండటం మనం చూడొచ్చు.ఈ క్రమంలోనే మనసుకు ఆహ్లాదం కలిగించే వీడియోలు చూస్తే హెల్త్‌కు చాలా మంచిదేనని కొందరు మానసిక నిపుణులు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube