పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లో బెస్ట్ సినిమాలు ఇవే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు, ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి.సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా రికార్డు స్థాయిలో పవన్ కళ్యాణ్ సినిమాలకు కలెక్షన్లు వస్తాయి.

 Best Movies In Star Hero Power Star Pawan Kalyan Cine Career, Best Movies, Film-TeluguStop.com

పవన్ కళ్యాణ్ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంటూనే రాజకీయాల్లో కూడా సక్సెస్ సాధించడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలలో బెస్ట్ సినిమాల గురించి చెప్పుకోవాలంటే మొదట సుస్వాగతం సినిమా గురించి చెప్పుకోవాలి.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటన ప్రేక్షకులు ఫిదా అయ్యే విధంగా ఉంటుంది.

ప్రేమించిన యువతి కొరకు తాపత్రయపడే పాత్రలో పవన్ కళ్యాణ్ జీవించారనే చెప్పాలి.సుస్వాగతం పవన్ సినీ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో ఒకటిగా నిలిచింది.

సుస్వాగతం తర్వాత పవన్ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో తొలిప్రేమ ఒకటని చెప్పవచ్చు.

కరుణాకరన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ అందమైన ప్రేమకథ యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది.

Telugu Badri, Career, Khushi, Pawan Kalyan, Suswagatham, Tholiprema, Vakeel Saab

ఆ తర్వాత పూరీ జగన్నాథ్ పవన్ కాంబినేషన్ లో తెరకెక్కిన బద్రి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.కొన్నేళ్ల క్రితం యువతను ఎక్కువగా ఆకట్టుకున్న సినిమాలలో బద్రి సినిమా కూడా ఒకటని చెప్పవచ్చు.పవన్ క్రేజ్ ను, ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఊహించని స్థాయిలో పెంచిన మూవీ ఖుషీ అని చెప్పవచ్చు.

Telugu Badri, Career, Khushi, Pawan Kalyan, Suswagatham, Tholiprema, Vakeel Saab

ఎస్ జె సూర్య డైరెక్షన్ లో తెరకెక్కిన ఖుషీ మూవీ బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలవడం గమనార్హం.ఖుషీ సినిమా పాటలను ఈతరం ప్రేక్షకులు కూడా సులభంగా మరిచిపోలేరు.ఖుషి తర్వాత జల్సా సినిమాతో పవన్ కళ్యాణ్ కమర్షియల్ సక్సెస్ ను సొంతం చేసుకున్నారు.

పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన డైలాగ్స్ ను తనదైన శైలిలో చెప్పి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.

Telugu Badri, Career, Khushi, Pawan Kalyan, Suswagatham, Tholiprema, Vakeel Saab

బాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్ గా నిలిచిన దబాంగ్ రీమేక్ గబ్బర్ సింగ్ మూవీ సైతం భారీస్థాయిలో కలెక్షన్లను సాధించి పవన్ కెరీర్ లోని హిట్లలో ఒక హిట్ గా నిలిచింది.అత్తారింటికి దారేది సినిమాతో పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ హిట్ సాధించగా వకీల్ సాబ్ సినిమాతో పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్ చేరింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube