సోషల్ మీడియాలో పెళ్లిళ్లకు సంబందించిన రకరకాల వీడియోలు బాగా వైరల్ అవుతున్న విషయం మనకి తెలిసిందే.పెళ్లి మండపంలో వధువరులు చేసిన హంగామా, డాన్సులు, ఫ్రెండ్స్ ఫన్నీ వీడియోలు ఇలా చాలా వీడియోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటూ వచ్చాయి.
అయితే ఇప్పుడు కూడా ఒక పెళ్ళికి సంబంధించిన వీడియో ఒకటి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది.అసలు అంతలా ఆ వీడియోలో ఏముందో అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.
పెళ్లిలో పెళ్లి కొడుకు తరుపు బంధువులు చేసే హడావుడి అంతా ఇంతా కాదు.మర్యాదకు ఏమాత్రం తక్కువ కాకుండా చూసుకోవాలి కదా మగ పెళ్ళివారిని.
ఈ క్రమంలోనే పెళ్లి కొడుకు మండపానికి వచ్చే అప్పుడు డబ్బు వాయిద్యాలతో, మేళ తాళాలతో ఊరంతా వినపడేటట్లు వాయించుకుంటూ ఏ కార్ లోనే లేక గుర్రం మీదనో, బైక్ మీదనో మండపానికి రావడం మనం చూసే ఉంటాము.అయితే ఇందుకు భిన్నంగా అలాంటివి ఏమి లేకుండా సింపుల్ గా చుట్టూ బంధువులు, సన్నిహితులతో కాకుండా కేవలం ఒక నలుగురు ఐదుగురు స్నేహితులతో మాత్రమే మండపానికి బయలుదేరాడు ఒక పెళ్లి కొడుకు.
అలాగని కార్ ఎక్కలేదు, గుర్రం కూడా ఎక్కలేదు ఇవన్నీ కాదు అసలు కాలు కూడా కింద పెట్టకుండా మరి మండపానికి వెళ్తున్నాడు.ఏంటి ఆ పెళ్లి కొడుకు ఎమన్నా గాలిలో తేలుతూ వస్తున్నాడా అనుకుంటున్నారా.
కాదండి తన స్నేహితుడి భుజాల మీద కూర్చుని మరి ఒక సూపర్ ఎంట్రీతో మండపానికి వస్తున్నాడు.ఒకసారి వీడియోను గమనిస్తే పెళ్లి కుమారుడు దర్జాగా షేర్ వాణి, తలకు పాగా పెట్టుకుని టిప్ టాప్ గా రెడీ అయ్యి తన ఫ్రెండ్ భుజాలపై ఎక్కి దర్జాగా కూర్చిని ఉండగా తన ఫ్రెండ్ పెళ్ళికొడుకుని మోస్తూ అడుగులు వేస్తున్నాడు.
కాగా అదే గ్రామంలోని చుట్టూ పక్కల పిల్లలు పెళ్లి కొడుకు ముందు ఉండి తీన్మార్ స్టెప్స్ వేస్తూ పెళ్లి కొడుకుని మండపం దగ్గరకు తీసుకుని వెళ్తున్నారు.ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లకు బాగా నచ్చడంతో పాటు విపరీతంగా లైక్స్ కొడుతూ షేర్ చేస్తున్నారు.
ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.ఫ్రెండ్ అంటే ననీలా ఉండాలని ఒకరంటే.
స్నేహితుడు కోసం ఎటువంటి కష్టాన్ని కూడా లెక్కచేయడం లేదని మరొకరు కామెంట్స్ పెడుతున్నారు.