మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం సినిమాల పరంగాఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే ఓ వైపు సినిమాలు చేస్తూ మరోవైపు పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.
అందులో హ్యాపీ మొబైల్స్ అనే సంస్థ కూడా ఒకటి.ఈ క్రమంలోనే ఆగస్టు 15 సందర్భంగా ఫుల్ పేజీ యాడ్ లు కొన్ని పేపర్లకి ఇచ్చింది.
యాడ్ లో భాగంగా చెర్రీ తెల్లటి దుస్తులు వేసుకుని జెండా పట్టుకుని కనిపించారు.అయితే ఈ జెండాలో అశోక చక్రం లేకపోవడంతో చాలా మంది రామ్ చరణ్ మన జాతీయ జెండాను అవమానించారంటూ పెద్దఎత్తున సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే సదరు కంపెనీ ఈ విషయంపై స్పందించి అసలు విషయాన్ని తెలియ జేసింది.ఈ విధమైనటువంటి ప్రకటనల కోసం జాతీయ జెండాను ఉపయోగించడం నేరం కనుక,అశోక చక్రం లేకుండా కేవలం జాతీయ జెండా రంగులను పోలి ఉన్నటువంటి జెండాను ఉపయోగించుకోవచ్చనే నియమం ఉండటంచేత అశోక చక్రం లేనటువంటి త్రివర్ణపతాకాన్ని ఈ అడ్వటైజ్మెంట్ కోసం ఉపయోగించినట్లు సదరు కంపెనీ యాజమాన్యం తెలియజేసింది.
ఈ విధమైనటువంటి జెండాను ఉపయోగించటం ఏమాత్రం నేరం కాదని వివరణ ఇచ్చింది.
ఇకపోతే సోషల్ మీడియా వేదికగా ఈ ఫోటోను పెద్దఎత్తున షేర్ చేస్తూ రామ్ చరణ్ జాతీయజెండాను అవమానించారని కామెంట్లు చేస్తున్నారు.ఇక సినిమాల విషయానికొస్తే రాజామౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ RRR సినిమాలో నటిస్తున్నారు.అదేవిధంగా మెగాస్టార్ కీలక పాత్రలో నటిస్తున్న టువంటి ఆచార్య సినిమాలో కూడా రామ్ చరణ్ నటిస్తున్నారు.