మామూలుగా చలన చిత్ర పరిశ్రమలో స్టార్ సెలబ్రిటీల వారసులకి ఉన్నటువంటి క్రేజ్ గురించి పెద్దగా తెలియజేయాల్సిన అవసరం లేదు.ఈ క్రమంలో సెలబ్రేటీల పిల్లలపై సోషల్ మీడియా మాధ్యమాలలో నిఘా బాగానే ఉంటుంది.
దీంతో వారి గురించి ఏ చిన్న విషయం బయటకు పొక్కిందంటే చాలు ఇట్టే వైరల్ అవుతుంది.కాగా బాలీవుడ్ ప్రముఖ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురికి సంబంధించిన వార్త మరియు కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇంతకీ ఆ వార్త ఏమిటంటే మూడేళ్ల క్రితం సారా అలీ ఖాన్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా కొన్ని ఫోటోలను షేర్ చేసింది అయితే ఇందులో సారా అలీ ఖాన్ హిందువుల దేవుడైన వినాయకుడిని పూజిస్తూ ఫోటోలు దిగింది.దీంతో అప్పట్లో ఈ అమ్మడు గురించి కొంత మంది నెగెటివ్ గా ప్రచారం చేశారు.
అంతేకాకుండా పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం మతానికి చెందిన ఓ మహిళ హిందూ దేవుళ్ళని పూజించడం సరికాదని కొందరు తప్పుడు ప్రచారాలు చేశారు.కానీ ఇంకొందరు మాత్రం భారత దేశంలో విభిన్న మతాలకు చెందిన ప్రజలు నివాసం ఉంటున్నారని కాబట్టి ఇ విభిన్న దేవుళ్ళను పూజించడంలో తప్పేముందని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాకుండా పల్లెటూర్లలో ముస్లింలు పవిత్రంగా జరుపుకునే మొహరం పండుగను హిందువులు కూడా జరుపుకుంటారని అలాంటప్పుడు సారా అలీ ఖాన్ వినాయకుడి పూజ చేయడంలో తప్పేముందని కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సారా అలీ ఖాన్ వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతోంది.కాగా ఆ మధ్య ఈ అమ్మడు హీరోయిన్ గా నటించిన “కూలి నెంబర్ వన్” చిత్రం బాక్సాఫీసు వద్ద పర్వాలేదనిపించింది.దీంతో అవకాశాలు కూడా బాగానే క్యూ కడుతున్నాయి.
కాగా ప్రస్తుతం హిందీలో టాప్ హీరోలైన అక్షయ్ కుమార్, ధనుష్, ప్రధాన తారాగణంగా నటిస్తున్న “అత్రాంగి రే” చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు ముంబై నగర పరిసర ప్రాంతంలో జరుగుతున్నట్లు సమాచారం.