తెలుగులో ఒకప్పుడు టాలీవుడ్ ప్రముఖ సీనియర్ హీరో శ్రీకాంత్ మరియు దర్శకుడు కే.రాఘవేంద్ర రావు ల కాంబినేషన్లో తెరకెక్కిన “పెళ్లి సందడి” చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి అందరికి తెలిసిందే.
అయితే ఈ చిత్రంలో శ్రీకాంత్ కి జోడిగా ప్రముఖ హీరోయిన్ రవళి మరియు దీప్తి భట్నాగర్ తదితరులు నటించగా “తనికెళ్ల భరణి, బాబు మోహన్, బ్రహ్మానందం, శ్రీ లక్ష్మి, రాజా రవీంద్ర, కైకాల సత్యనారాయణ, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.అయితే ఈ చిత్రంలో నటించిన తరువాత దీప్తీ భట్నాగర్ మళ్ళీ తెలుగు చిత్రాలలో పెద్దగా నటించలేదు.
కాగా ఆ మధ్య ప్రముఖ హీరో రాజశేఖర్ హీరోగా నటించిన “మా అన్నయ్య” చిత్రంలోని ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలలో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు.
అయితే దాదాపుగా 25 సంవత్సరాల తరువాత ఈ చిత్రానికి సీక్వెల్ ని మళ్ళీ తెలుగులో తెరకెక్కిస్తున్నారు.
ప్రస్తుతం ఈ చిత్ర సీక్వెల్ లో హీరో శ్రీకాంత్ పెద్ద కొడుకు రోషన్ హీరోగా నటిస్తున్నాడు.అప్పట్లో ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు ఈ చిత్రంలో వశిష్ట అనే పాత్రలో నటిస్తున్నాడు.
అలాగే ఈ చిత్రంలో హీరో తల్లి పాత్రలో దీప్తి భట్నాగర్ నటిస్తోంది.ఇటీవలే దీప్తి భట్నాగర్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పెళ్లి సందడి చిత్రంలో తాను 25 సంవత్సరాల క్రితం ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు గారితో కలిసి పని చేశానని, అలాగే తనని హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశాడని ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు రాఘవేంద్రరావు సరసన నటించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపింది.
అంతేకాకుండా ఈ చిత్రంలో తన లుక్ కి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేసింది.దీంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అంతేకాకుండా దీప్తి భట్నాగర్ దాదాపుగా 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ నటిగా తన సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభిస్తోంది.
కాగా ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు పూర్తి కావాల్సి ఉండగా ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా కొంత కాలం పాటు నిలిపివేయడంతో చిత్ర యూనిట్ సభ్యులు అనుకున్న సమయానికి పూర్తి చేయలేక పోయారు.కాగా ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో మళ్లీ ఇటీవలే షూటింగ్ పనులు ప్రారంభమైనట్లు సమాచారం.