ఢిల్లీ వేదికగా హుజురాబాద్ వ్యూహాలు.. బిజెపిలో పెరిగిన జోష్!

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఎమ్మెల్యేగా రాజీనామాతో చేయడంతో ఖాళీ అయిన హుజురాబాద్ నియోజకవర్గంలో రాజకీయ వేడి ఎక్కువ అవుతుంది.ఇప్పటికే భారతీయ జనతా పార్టీలో చేరిన ఈటెల రాజేందర్, బీజేపీ అగ్ర నాయకులతో వరుస భేటీలు అవుతుండటంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

 Huzurabad Strategies As Delhi Venue Josh Grew Up In Telangana Bjp, Etala, Bjp, T-TeluguStop.com

ఇందులో భాగంగానే తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రతో పాటు హుజురాబాద్ నియోజకవర్గంలో అగ్ర నాయకులతో భారీ బహిరంగ సభ ఏర్పాటుకు పార్టీ నాయకలు పథక రచన చేస్తున్నారు.

అయితే పార్టీలో చేరిన మొదట్లోనే బీజేపీ అగ్ర నాయకులైన ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలతో మర్యాదపూర్వకంగా భేటీ కావాలని ఈటెల రాజేందర్ తీవ్రంగా ప్రయత్నించారు.

అయితే అప్పుడు కుదరకపోవడంతో కొంత నిరుత్సాహానికి గురయ్యారు.తాజాగా బండి సంజయ్, ఈటెల రాజేందర్ మాత్రమే కాకుండా, రాష్టానికి చెందిన ముఖ్య బీజేపీ నేతలు వివేక్, జితేందర్, ఏనుగు రవీందర్, దుగ్యాల ప్రదీప్, గుజ్జల ప్రేమేందర్‌లతో కలిసి హోం మంత్రి అమిత్ షాను కలిశారు.

వీరి సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరియు బీజేపీ తెలంగాణ ఇంచార్జి తరుణ్ చుగ్ కూడా హాజరవడంతో భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.

Telugu @bjp4india, Eetala Rajendar, Etela Rajender, Kishan Reddy, Met Amit Sha,

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి, తెలంగాణలో అధికారంలో రావడానికి హుజురాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించాలని అగ్రనాయకులు పేర్కొన్నట్లు సమాచారం.ఇప్పటికే ఈటెల రాజేందర్‌కు హుజురాబాద్‌లో మంచి ఫాలోయింగ్ ఉండటం, అంతేకాకుండా బండి సంజయ్ కరీంనగర్ ఎంపీగా మరియు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉండటం పార్టీ గెలుపుకు కలిసి వస్తుందని విశ్లేషకులు అంటున్నారు.ఖచ్చితంగా హుజురాాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీని గెలిపించి, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ దళాన్ని విజేతలుగా తీర్చి దిద్దడానికి కృషి చేస్తామని కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube