కరోనా తొలిదశ లాక్ డౌన్ తర్వాత థియేటర్లలో విడుదలై సంచనల విజయం సాధించిన సినిమా జాతిరత్నాలు.ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టితోపాటు తన మార్క్ నటనతో ఆకట్టుకున్న నటుడు రాహుల్ రామకృష్ణ.
తన చక్కటి నటనతో పలు సినిమాలు చేస్తూ జనాలకు మరింత దగ్గరయ్యాడు.ఈ సినిమాలో హీరో నవీన్ పోలిశెట్టి , ప్రియదర్శిలతో కల్సి రాహుల్ చేసిన కామెడీ వారెవ్వా అనిపించింది.
అర్జున్ రెడ్డి సినిమాతో నటుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు రాహుల్ రామకృష్ణ.అనంతరం విజయ్ దేవరకొండతో కల్సి గీతాగోవిందం మూవీలో నటించాడు.ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో కల్సి భరత్ అనే నేను మూవీలో నటించాడు.ఈ సినిమాలన్నీ వరుసగా విజయాలు సాధించాయి.
అటటు రాహుల్ గడ్డం, మీసం పై సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి.తన ఈ గెటప్ వెనుక ఓ రహస్యం ఉందనే టాక్ వినిపిస్తుంది.

ఇంతకీ ఆయన గడ్డం, మీసాల పెంపక వెనక దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది.ఆయన తాజాగా తెరకెక్కిస్తున్న త్రిఫుల్ ఆర్ సినిమాలో రాహుల్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడట.జూనియర్ ఎన్టీఆర్ కి అనుచరునిగా ఈ మూవీలో చాలా సేపు కనిపిస్తాడట.అందుకే రాజమౌళి సూచనల మేరకు ఆయన గడ్డం, జుట్టు పెంచాడట.

ఈ సినిమా కోసం చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం లాక్ డౌన్ లో సైతం రాహుల్ తన గడ్డం, జుట్టు తీయలేదనే వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు రాహుల్ ఇదే గెటప్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమా కోసం రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కూడా తమ లుక్స్ ని మార్చుకోకపోవడం విశేషం.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి చాలా భాగం షూటింగ్ పూర్తయ్యింది.
కొన్ని చిన్న చిన్న సీన్లు మాత్రమే పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.త్వరలోనే వాటిని కూడా కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడట రాజమౌళి.
మరి ఈ సినిమాలో రాహుల్ ఎలా అలరిస్తాడో చూడాలి.