మొదట్లో విమర్శలు, ఆ తరువాత లేఖలతో నిత్యం వైసీపీ కి చుక్కలు చూపిస్తున్న ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు పై అనర్హత వేటు పడే సమయం దగ్గరగా పడినట్టుగా వైసిపి ఇప్పుడు సంబరపడుతోంది.జులై 19వ తేదీ నుంచి ఆగస్టు 13 వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగబోతున్నాయి.
నేపథ్యంలో రఘురామ పై అనర్హత వేటు విషయంలో స్పష్టమైన క్లారిటీ రాబోతున్నట్లు గా వైసీపీకి సమాచారం ఉంది.ఇప్పటికే అనేక సార్లు లోక్ సభ స్పీకర్ కు రఘు వ్యవహారంపై ఫిర్యాదులు వైసీపీ ఎంపీలు చేశారు.
అలాగే అవకాశం దొరికినప్పుడల్లా కేంద్ర బిజెపి పెద్దలతో ను ఇదే విషయంపై ఎంపీలు చర్చిస్తున్నారు.అలాగే మొన్నీమధ్య ఢిల్లీకి వెళ్లిన జగన్ ప్రధానంగా చర్చించిన అంశము ఇదేనట.
రఘురామ కృష్ణం రాజు పై అనర్హత వేటు పడితేనే తమ పరువు ఏపీలో నిలబడుతుంది అన్నట్లుగా వైసిపి అభిప్రాయపడుతోంది.ఇక కేంద్ర క్యాబినెట్ లో వైసీపీ కి ప్రాధాన్యం ఇచ్చేలా కేంద్ర బిజెపి పెద్దలు ప్రయత్నాలు చేస్తుండటం, మూడు మంత్రి పదవులు ఇచ్చేందుకు ప్రతిపాదనలు పెట్టడం తదితర వ్యవహారాలతో రానున్న రోజుల్లో బిజెపి వైసిపి సన్నిహితంగా మెలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
అది జరగాలంటే ముందుగా రఘురామ వేటు పడాల్సిందే అన్నట్టుగా బిజెపి పై జగన్ ఒత్తిడి పెంచే అవకాశం కనిపిస్తోంది.తాజాగా వైసీపీ రాజమండ్రి ఎంపీ, లోక్ సభ చీఫ్ విప్ మార్గాని భరత్ లోక్ సభ స్పీకర్ ను కలిసి రఘురామ పై అనర్హత వేటుకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించగా, ప్రస్తుతం ఆ వ్యవహారం సెక్రటేరియట్ పరిశీలనలో ఉందని తేలిందట.
ప్రస్తుతం కేంద్రంలో చోటుచేసుకుంటున్న వ్యవహారాలపై రఘురామకృష్ణంరాజు కాస్త టెన్షన్ గానే ఉన్నట్లు తెలుస్తోంది.ఏది ఏమైనా వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో రఘురామకృష్ణంరాజు అనర్హత వేటు పై క్లారిటీ వచ్చే అవకాశం ఉండడంతో జగన్ కాస్త రిలీఫ్ అవుతున్నారట.