ఎదిగే పిల్లల్లో పౌష్టికాహారం( Nutrition in children ) కీలక పాత్ర వహిస్తుంది.ముఖ్యంగా మూడేళ్లు నిండిన దగ్గర నుంచి పిల్లల డైట్ విషయంలో మరింత కేర్ తీసుకోవాలి.
వారి శారీరక మరియు మానసిక ఎదుగుదలకు తోడ్పడే ఆహారాలను ఇవ్వాలి.అయితే చాలా మంది తల్లిదండ్రులకు ఈ విషయంపై పెద్దగా అవగాహన ఉండదు.
ఈ నేపథ్యంలోనే మూడేళ్లు నిండిన పిల్లల డైట్ లో కచ్చితంగా చేర్చాల్సిన ఆహారాలు ఏవేవో ఇప్పుడు తెలుసుకుందాం.
పిల్లల్లో కండరాల ఎదుగుదలకు, కణజాల నిర్మాణానికి ప్రోటీన్లు చాలా అవసరం.
అందువల్ల పప్పు దినుసులు, చేపలు, చికెన్ బ్రెస్ట్, పాలు, పాల ఉత్పత్తులు( fish, chicken breast, milk, dairy products ) ఇవ్వాలి.వీటి ద్వారా ప్రోటీన్ పుష్కలంగా పిల్లలకు అందుతుంది.
అలాగే ఎదిగే పిల్లలు ఎముకల దృఢత్వానికి కాల్షియం అవసరం అవుతుంది.అందుకు పిల్లలు చేత గుడ్లు, ఆకుకూరలు తినిపించాలి.
పిల్లల డైట్ లో ధాన్యం, తాజా కూరగాయలు, తాజా పండ్లు చేర్చాలి.

ధాన్యం పిల్లల శరీరానికి అవసరమయ్యే కార్బోహైడ్రేట్స్ ను అందిస్తుంది.అలాగే తాజా కూరగాయలు, తాజా పండ్లు ద్వారా ఎదిగే పిల్లలకు అవసరమయ్యే వివిధ రకాల విటమిన్లు చేకూరతాయి.పిల్లల చేత నిత్యం డ్రై ఫ్రూట్స్( Dry fruits ) తినిపించాలి.
డ్రై ఫ్రూట్స్ జింక్ పుష్కలంగా ఉంటుంది.ఇది పిల్లల్లో మానసిక ఎదుగుదలకు తోడ్పడుతుంది.
జ్ఞాపక శక్తిని, ఆలోచన శక్తిని పెంచుతుంది.శరీర కణ నిర్మాణానికి తోడ్పడే మెగ్నీషియం కూడా డ్రై ఫ్రూట్స్ లో మెండుగా ఉంటుంది.

పిల్లల్లో కంటి చూపును చురుగ్గా మార్చడానికి విటమిన్ ఎ అవసరం.అందుకోసం క్యారెట్, క్యాప్సికం, బొప్పాయి, పాలకూర, నెయ్యి( Carrot, Capsicum, Papaya, Lettuce, Ghee ) వంటి ఆహారాలను పిల్లల డైట్ లో చేర్చాలి.ఇక రోగ నిరోధక వ్యవస్థ పెంచడానికి, నాడీ వ్యవస్థ బలపడడానికి, ఎముకల దృఢత్వానికి విటమిన్ డి కావాలి.దీనికోసం పిల్లలను నిత్యం ఉదయం పూట ఎండకు నిలబెడితే మంచిది.
సూర్యకిరణాల ద్వారా విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది.చేపలు, పుట్టగొడుగులు, కోడి గుడ్డు వంటి ఆహారంలో కూడా విటమిన్ డి ఉంటుంది.