IAS Sedhu Madhavan : 17వ ఏట తండ్రి మరణం.. ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఐఏఎస్.. సేతు మాధవన్ సక్సెస్ కు హ్యాట్సాఫ్ అనాల్సిందే!

ఐఏఎస్ ( IAS ) సాధించిన ప్రతి వ్యక్తి సక్సెస్ వెనుక ఎన్నో కష్టాలు ఉంటాయి.అలా ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఎంతోమందికి స్పూర్తిగా నిలిచిన వ్యక్తులలో ఐఏఎస్ సేతు మాధవన్( IAS Sedhu Madhavan ) ఒకరు.

 Ias Sedhu Madhavan Inspirational Success Story Details-TeluguStop.com

సివిల్స్ కోచింగ్ తీసుకోవడానికి ఆర్థికంగా అవసరమైన డబ్బులు లేకపోవడంతో సేతు మాధవన్ బలమైన లక్ష్యాన్ని ఏర్పరచుకుని ముందడుగులు వేశారు.మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన సేతు మాధవన్ స్పూర్తితో ఇష్టంగా చదివి కెరీర్ పరంగా సక్సెస్ అయ్యారు.

కేంద్ర ప్రభుత్వం ఏడాదికి 50 మందికి ఫ్రీగా శిక్షణ ఇస్తుందని ఆ శిక్షణకు ఎంపికైన సేతు మాధవన్ యూపీఎస్సీ సివిల్స్ లో( UPSC Civils ) మంచి ర్యాంక్ సాధించి ఐఏఎస్ అయ్యారు.ప్రస్తుతం సేతు మాధవన్ నెల్లూరు జిల్లాకు జాయింట్ కలెక్టర్ గా పని చేస్తున్నారు.

తమిళనాడు రాష్ట్రంలోని( Tamil Nadu ) కంది కుప్పం గ్రామానికి చెందిన సేతు మాధవన్ తన 17వ ఏట తండ్రి మరణించాడని చెప్పుకొచ్చారు.

Telugu Iassedhu, Ias Story, Story, Nelloresedhu, Tamil Nadu-Inspirational Storys

ఇంటర్ వరకు కృష్ణగిరి జిల్లాలోనే విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన సేతు మాధవన్ కోయంబత్తూరులో బీటెక్ పూర్తి చేశారు.బాల్యం నుంచి ఐఏఎస్ ను లక్ష్యంగా పెట్టుకున్న సేతు మాధవన్ ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం కష్టపడి చివరకు సక్సెస్ ( Success ) అయ్యారు.ఒకానొక సమయంలో క్యాస్ట్, ఇన్ కం సర్టిఫికెట్ల కోసం ఎంతో కష్టపడాల్సి వచ్చిందని సేతు మాధవన్ అభిప్రాయపడ్డారు.

Telugu Iassedhu, Ias Story, Story, Nelloresedhu, Tamil Nadu-Inspirational Storys

గాంధీ, కలాం ఆటో బయోగ్రఫీలు నాలో స్పూర్తి నింపాయని ఆయన చెప్పుకొచ్చారు.2021 సంవత్సరంలో మాధవన్ శోభికను వివాహం చేసుకున్నారు.శోభిక పార్వతీపురం జాయింట్ కలెక్టర్ గా పని చేస్తున్నారు.ప్రజలకు సేవ చేయడం లక్ గా భావిస్తానని ఆయన అన్నారు.జిల్లాలో రెవిన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెడతానని ఆయన తెలిపారు.సేతు మాధవన్ సక్సెస్ స్టోరీ ఎంతగానో ఆకట్టుకుంటోందని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube