ధర్మానికి, అధర్మానికి మధ్య పోరాటం అంటున్న ఈటెల...ఇక రణమేనా?

తెలంగాణ రాజకీయాలు రణరంగంగా మారుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.అయితే ఇప్పటివరకు ఈటెల- కేసీఆర్ మధ్య మాటల తూటాలు కాస్త ఇప్పుడు బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ గా మారే అవకాశం ఉంది.

 The Etela That Speaks Of The Struggle Between Right And Wrong  Is It War Anymore-TeluguStop.com

అయితే ఇప్పటికే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పించిన ఈటెల, వెంటనే ఈటెల రాజీనామాకు స్పీకర్ కూడా ఆమోదం తెలపడం జరిగింది.అయితే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సందర్బంగా ఈటెల సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

పదవికి రాజీనామా చేసిన తరువాత చాలా స్వేచ్చగా ఉందని, ఇక కేసీఆర్ నుండి తెలంగాణను విముక్తి చేయడమే నా లక్ష్యమని ఆ దిశగానే నా పోరాటం ఉంటుందని ఈటెల స్పష్టం చేసారు.

Telugu @cm_kcr, Telangana, Trs-Political

ఇక తన రాజీనామా తరువాత విలేఖరుల సమావేశం నిర్వహించిన ఈటెల తరువాత ఇక బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.ఏది ఏమైనా ఈటెల అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు.ఇక బీజేపీలో చేరిన తరువాత రాజకీయ విమర్శలు టీఆర్ఎస్ ను పెద్ద ఎత్తున ఇరుకున పెట్టేలా ఉండేలా కనిపిస్తున్నాయి.

ఇక బీజేపీలోని ఇతర నాయకులు సైతం టీఆర్ఎస్ పై పెద్ద ఎత్తున విమర్శలు ఎక్కుపెట్టేలా కనిపిస్తున్న పరిస్థితి ఉంది.ఏది ఏమైనా హుజూరాబాద్ రాజకీయం మంచి రసకందాయంగా మారుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube