స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ తెలుగులో మల్లీశ్వరి, అల్లరి పిడుగు సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే.ఆ సినిమాలతో కత్రినా కైఫ్ కు మంచి పేరు రాగా ఆ తరువాత కత్రికా కైఫ్ బాలీవుడ్ ఇండస్ట్రీపై దృష్టి పెట్టారు.
బాలీవుడ్ ఇండస్ట్రీలో కత్రినా కైఫ్ నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు హిట్ కావడంతో ఆమె బాలీవుడ్ కే కత్రినా పరిమితం కావాల్సి వచ్చింది.అయితే ఈ హీరోయిన్ ఒక యువ హీరోతో డేటింగ్ చేస్తోందని సమాచారం.
గతంలో కూడా కత్రినా కైఫ్ డేటింగ్ కు సంబంధించి కొన్ని వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.కొన్నేళ్ల క్రితం కత్రినా హీరో రణబీర్ కపూర్ తో డేటింగ్ చేశారు.సల్మాన్ ఖాన్ కత్రినా కైఫ్ మధ్య కూడా ఏదో ఉందని వార్తలు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఈ హీరోయిన్ విక్కీ కౌశల్ తో డేటింగ్ లో ఉందని వార్తలు వచ్చాయి.
కొన్ని రోజుల క్రితం విక్కీ, కత్రినా ఒకే భవనంలో ఉన్న ఫోటోలు నెట్టింట హల్చల్ చేసిన సంగతి తెలిసిందే.
ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ కరణ్ జోహార్, హీరో హర్షవర్ధన్ కపూర్ మాట్లాడుతూ కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ తో డేటింగ్ లో ఉన్నారని వెల్లడించారు.సూర్యవంశీ సినిమా ప్రమోషన్ లో భాగంగా కరణ్ జోహార్ ఈ విషయాలను వెల్లడించడం గమనర్హం.మరోవైపు కత్రినా కైఫ్ రాబోయే రోజుల్లో టాలీవుడ్ ఇండస్ట్రీ సినిమాల్లో నటిస్తారేమో చూడాల్సి ఉంది.
ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్లు ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాలలో బాలీవుడ్ ఇండస్ట్రీ హీరోయిన్లను తీసుకోవడానికి దర్శకనిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.
మరి టాలీవుడ్ సీనియర్ హీరోలకు జోడీగా ఛాన్స్ వస్తే కత్రినా కైఫ్ ఓకే చెబుతారో లేదో చూడాల్సి ఉంది.