డెలివరీ బాయ్ గా మారిన డాన్సర్.. అంతలోనే ప్రమాదం?

కొందరి జీవితాల్లో ఎంతో ఎత్తుకు ఎదిగిన చివరికి వాటివల్ల ఏమీ మిగలదు.నిజానికి తాము అనుకున్న కోరిక నెరవేరినట్లే నెరవేరుతుంది కానీ చివరి క్షణాల్లో అది కాస్త నిరాశ అవుతుంది.

 Dancer Became The Delivery Boy Dancer Biki Das, Delivery Boy, Bike Accident, Dan-TeluguStop.com

ఇక ఇలాంటి జీవితాన్ని ఎదుర్కొని వచ్చిన ఓ డాన్సర్ కు తన డాన్స్ ఒక కలగా మారింది.అటు నుంచి వేరే దారిని ఎంచుకున్న అతడికి అంతలోనే ఓ ప్రమాదం ఎదురయ్యింది.

ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఎంతలా ఉందో అందరికీ తెలిసిందే.ఈ నేపథ్యంలో అన్ని నిషేధాలు విధించగా ఎంతో మంది కూలీలు తమ ఉపాధి కోల్పోగా కూలీల పరిస్థితులు ఎంతో తీవ్రంగా మారింది.

ఇదిలా ఉంటే 2014లో ప్రసారమైన డాన్స్ ఇండియా డాన్స్ సీజన్ ఫోర్ లో పాల్గొన్న డాన్సర్ బికి దాస్.తన డాన్స్ తో, ఎనర్జీతో మంచి పేరు అందుకున్నాడు.చివరి వరకు తన పర్ఫామెన్స్ తో బాగా అదరగొట్టాడు.కానీ చివరిలో సెకండ్ రన్నరప్ గా నిలిచాడు.

నిజానికి ఈ షో ద్వారా అతడు ఎటువంటి లాభాలు అందుకోలేదు.

Telugu Bike, Dance India, Biki Das, Delivery Boy-Movie

ఇక ఆ తర్వాత పలు ఈవెంట్లకు తన డాన్స్ పర్ఫార్మెన్స్ తో ప్రోగ్రాములు చేసేవాడు.కేవలం ఈవెంట్లు ఉన్నప్పుడు మాత్రమే ఎంతో కొంత సంపాదించేవాడు.కానీ ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల ఆ ఈవెంట్లు కాస్త నిలిచిపోగా దీంతో ఆయన ఉపాధి కూడా లేకుండా పోయింది.

ఇక చేసేదేమీ లేక గత పది రోజుల నుండి కోల్ కత్తా లో ఫుడ్ డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు.ఇక శుక్రవారం అతడు తన బైక్ మీద వెళ్తున్న సమయంలో మరో బైక్ ఢీకొట్టడంతో ఆయనకు ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో అతడికి గాయాలు అవ్వగా పక్కటెముకలు విరగడంతో ఆస్పత్రిలో చేర్చారు.ఇక ఆయన భార్య ఈ ఘటన గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube