50 ఏళ్ల తర్వాత నాసా జాబిల్లి యాత్ర.. ‘‘ అర్టెమిస్‌’’ ప్రాజెక్ట్‌లో భారతీయురాలి కీలక పాత్ర

చీకటిపడ్డాక ఆకాశంలోకి వచ్చి చల్లదనాన్ని పంచే చంద్రుడు అంటే ఇష్టపడని మనిషి వుండడు.కవులైతే ఇక చెప్పక్కర్లేదు.

 India Born Engineer Subashini Iyer Oversees Backbone Of Nasa Mission To Moon And-TeluguStop.com

చందమామను వర్ణిస్తూ రకరకాల పాటలు రాశారు.చంటి పిల్లాడు మారాం చేస్తే ఆకాశంలో ఉన్న చందమామను చూపించి తల్లి గోరుముద్దలు తినిపిస్తుంది.

అలా మనిషి జీవితంతో జాబిల్లి బంధం వేల ఏళ్ల నుంచి పెనవేసుకుపోయింది.చంద్రుడు అంటే మనిషికి అనాది కాలం నుంచి ఆసక్తే.

ప్రాచీన కాలంలో ఎందరో ఖగోళ శాస్త్రవేత్తలు చందమామపై పరిశోధనలు చేశారు.ఆధునిక యుగంలో ఈ పరిశోధనలే చంద్రుడి మీద కాలు పెట్టేలా చేసింది.

అపోలో –11’ అంతరిక్ష నౌక ద్వారా అమెరికా వ్యోమగామి నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ 1969 జులై 21న చంద్రుడి మీద అడుగుపెట్టిన తొలి మానవుడిగా తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు.ఈ విజయంతో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) పేరు మారుమోగిపోయింది.

ఆ తర్వాత ఎన్నో ప్రతిష్టాత్మక ప్రయోగాలను చేపట్టిన నాసా.చందమామను మరిచిపోయింది.అయితే దాదాపు 50 ఏళ్ల తర్వాత చంద్రుడిపై ప్రయోగానికి సిద్ధమైంది.దీనిలో భాగంగా 2024లో నాసా ‘‘అర్టెమిస్’’ ప్రోగ్రామ్ పేరుతో వ్యోమగాములను చందమామ మీదకు పంపనుంది.

ఈ ప్రాజెక్ట్‌లో ఎంతోమంది శాస్త్రవేత్తలు, కంపెనీలు పాలు పంచుకుంటున్నాయి.వీరిలో భారతీయులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.

అర్టెమిస్‌కు ఎంపికైన వ్యోమగాముల్లో భారత సంతతికి చెందిన రాజాచారి చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.వీరందరికీ 2020 జనవరిలోనే శిక్షణ పూర్తయ్యింది.

Telugu Artemis, Astronautneil, Astronomers, Subhashini Iyer, Vlb Janakimayi-Telu

ఇకపోతే అర్టెమిస్‌లో భారత మూలాలున్న మహిళా శాస్త్రవేత్త సుభాషిణీ అయ్యర్ కీలక పాత్ర పోషిస్తున్నారు.అర్టెమిస్ స్పేస్ క్రాఫ్ట్ ను అంతరిక్షంలోకి తీసుకెళ్లే కీలకమైన బోయింగ్ ‘కోర్ స్టేజ్’ను సుభాషిణీ పర్యవేక్షిస్తున్నారు.దీనిని ప్రాజెక్ట్‌కే వెన్నెముకగా నిపుణులు చెబుతున్నారు.అర్టెమిస్‌ను నాసా మూడు భాగాలుగా నిర్వహిస్తోంది.అర్టెమిస్ 1లో సిబ్బంది లేకుండా స్పేస్ క్రాఫ్ట్ ను పంపిస్తున్నారు.అర్టెమిస్ 2లో చంద్రుడి చుట్టూ తిరిగొచ్చేలా క్రూను పంపిస్తున్నారు.

చంద్రుడిపై కాలుమోపే అసలైన ప్రయోగం అర్టెమిస్ 3ని 2024లో చేపట్టనున్నారు.అర్టెమిస్ 1లో భాగంగా స్పేస్ లాంచ్ సిస్టమ్ ద్వారా ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ ను జాబిల్లి వద్దకు పంపించనున్నారు.

Telugu Artemis, Astronautneil, Astronomers, Subhashini Iyer, Vlb Janakimayi-Telu

తమిళనాడులోని కోయంబత్తూరులో జన్మించిన సుభాషిణీ 1992లో వీఎల్ బీ జానకిమయీ కాలేజీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ పట్టాను పొందారు.అర్టెమిస్ ప్రాజెక్ట్‌ గురించి సుభాషిణీ మాట్లాడుతూ.50 ఏళ్ల క్రితం చంద్రుడిపై కాలుమోపామని.మళ్లీ ఇప్పుడు వెళ్లబోతున్నామన్నారు.

అర్టెమిస్‌లో నాసా తన నుంచి ఏం కోరుకుంటోందో అంతకన్నా ఎక్కువే అందిస్తానని సుభాషిణీ స్పష్టం చేశారు.కోర్ స్టేజ్ పూర్తయిన తర్వాత కూడా ప్రాజెక్ట్‌లో తన వంతు సహకారం అందిస్తానని ఆమె తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube