స్టార్ కిడ్స్ ఇండస్ట్రీలో అడుగు పెట్టడం చాలా కామన్ గా జరిగే విషయం.కొందరు పిల్లలు పెద్ద వారు అయ్యాక హీరోగా లేదా హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తే మరి కొందరు మాత్రం పిల్లలుగా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తారు.
ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయినట్లుగా సమాచారం అందుతోంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వెబ్ సిరీస్ తో సితార ప్రేక్షకుల ముందుకు రాబోతుందట.
ఇప్పటికే యూట్యూబ్ ఛానెల్ ను నిర్వహిస్తున్న సితార చాలా వీడియోలు చేసింది.స్నేహితురాలు ఆధ్యతో కలిసి సితార చేసిన వీడియోలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
కనుక వీరిద్దరు కలిసి ఒక ఓటీటీ కంటెంట్ లో నటించేందుకు ఓకే చెప్పారనే వార్తలు వస్తున్నాయి.
వెబ్ సిరీస్ లో ప్రముఖ నటీనటులు కనిపించబోతున్నారు.
కనుక ఈ వెబ్ సిరీస్ లో సితూ పాపను నటింపజేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది.పెద్ద ఎత్తున అంచనాల నడుమ రూపొందబోతున్న ఆ వెబ్ సిరీస్ ను ప్రముక దర్శకుడు రూపొందిస్తాడనే సమాచారం అందుతొంది.
సితూ పాప స్క్రీన్ ప్రజెన్స్ ఏకంగా అర్థ గంట వరకు ఉంటుందని అంటున్నారు.ప్రస్తుతం వెబ్ సిరీస్ కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని చెబుతున్నారు.
రికార్డు బ్రేకింగ్ బడ్జెట్ ను ఈ వెబ్ సిరీస్ కు ఆ నిర్మాతలు చెబుతున్నారట.కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గిన తర్వాత షూటింగ్ ను మొదలు పెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు.
సితారకు ఉన్న సోషల్ మీడియా క్రేజ్ మరియు ఆమె తండ్రి మహేష్ బాబు స్టార్ డం నేపథ్యంలో ఆ వెబ్ సిరీస్ క్రేజ్ అమాతం పెరగబోతుంది.ప్రేక్షకులు సితూ పాప వెబ్ సిరీస్ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నారు.