సాధారణంగా స్టార్ హీరోలు కొత్త డైరెక్టర్ డైరెక్షన్ లో సినిమా అంటే తెగ భయపడతారు.అయితే నాగార్జున మాత్రం అందుకు భిన్నం.
కొత్త డైరెక్టర్లకు ఎక్కువగా అవకాశాలు ఇచ్చే స్టార్ హీరోగా నాగార్జునకు పేరుంది.కొంతమంది కొత్త డైరెక్టర్లు నాగార్జునకు విజయాలను అందిస్తే మరి కొందరు కొత్త డైరెక్టర్లు మాత్రం నాగార్జునకు భారీ షాకులిచ్చారు.
అయితే నాగార్జున మాత్రం కథ నచ్చితే డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చే విషయంలో వెనక్కు తగ్గడం లేదు.

చాలా సంవత్సరాల క్రితం నాగార్జున హీరోగా గ్రేసీసింగ్, శ్రియ సరన్ హీరోయిన్లుగా దశరథ్ డైరెక్షన్ లో కేఎల్ నారాయణ నిర్మాతగా సంతోషం సినిమా తెరకెక్కి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.ఈ సినిమా నిర్మాత తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దశరథ్ ను తాను నాగార్జున దగ్గరకు తీసుకెళితే లైన్ విన్న నాగార్జున దశరథ్ ను దర్శకత్వం వహించమని కోరాడని కేఎల్ నారాయణ అన్నారు.
తాను కూడా సంతోషం సినిమాకు దర్శకత్వం వహించమని దశరథ్ ను అడిగానని ఆ మాట తరువాత వారం రోజుల వరకు తనకు దశరథ్ కనిపించలేదని అన్నారు.
ఆ తరువాత తాను కనిపించకుండగా ఎక్కడికెళ్లావ్ అని ప్రశ్నించగా దశరథ్ తనకు భయమేసిందని చెప్పారని అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా అనుభవం లేని తాను ఏ విధంగా డైరెక్షన్ చేయాలో తోచలేదని దశరథ్ కేఎల్ నారాయణకు చెప్పారు.