గత ఏడాది దాదాపుగా ఆరు నెలల పాటు షూటింగ్ లు పూర్తి స్థాయిలో జరుగక పోవడంతో సినీ కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు.చాలా మంది ఇండస్ట్రీని వదిలేసి ఊర్లకు వెళ్లి పోయారు.
కాస్త పరిస్థితి కుదుట పడుతుంది అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా మళ్లీ కరోనా సెకండ్ వేవ్ తో పరిస్థితి తలకిందులు అయ్యింది.ఏమాత్రం పరిస్థితి సినిమాల విడుదలకు అవకాశం లేదు.
దాంతో ఇక చేసేది లేక మళ్లీ షూటింగ్ లు నిలిపి వేయాల్సి పరిస్థితి వచ్చింది.ఆ సమయంలోనే మళ్లీ లాక్ డౌన్ ను తెలంగాణలో విధించారు.
దాంతో బుల్లి తెర వెండి తెర ఇలా అన్నింటికి సంబంధించిన చిత్రీకరణ పూర్తి అయ్యింది.లాక్ డౌన్ మరియు ఇతర కారణాల వల్ల ఇండస్ట్రీలో వాతావరణం పూర్తిగా డ్రై గా ఉంది.
జూన్ మొదటి వారంలో షూటింగ్ లకు అనుమతులు వచ్చే అవకాశం ఉందని అంతా భావించారు.కాని కొత్తగా తీసుకు వచ్చిన లాక్ డౌన్ నిబంధనలు షూటింగ్ కు అనుకూలంగా లేవు.
సీరియల్స్ మరియు షో లు కాస్త షూటింగ్ కు అవకాశం ఉంది.కాని సినిమాలు అంటే మామూలు విషయం కాదు. నైట్ షూట్ లు మరియు డే అంతా కూడా షూటింగ్ చేయాల్సి ఉంటుంది.కాని ఉదయం 6 నుండి 1 గంట వరకే అంటే షూటింగ్ సాధ్యం కాకపోవచ్చు అంటున్నారు.
ఈసారి వచ్చిన కొత్త గైడ్ లైన్స్ వల్ల కూడా పెద్ద గా ప్రయోజనం లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం షూటింగ్ లు మద్యలో ఆగిపోవడంతో నిర్మాతలు చాలా నష్టపోతున్నారు.
అయినా కూడా సినిమా ల షూటింగ్ లకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం లేదు.కొందరు మాత్రం ఇండోర్ లో చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
జులై చివరి వరకు అయినా కాస్త పరిస్థితి సర్థు మనుగుతుందో చూడాలి.