2050 సంవత్సరానికి మనను తీసుకు వెళ్లబోతున్న ప్రభాస్‌

పాన్‌ ఇండియా సూపర్‌ స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు అన్నింటిపై కూడా ఓ రేంజ్ అంచనాలు ఉన్నాయి.కాని తెలుగు ప్రేక్షకులు మాత్రం ఎక్కువగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నారు.

 Prabhas And Nag Ashwin Movie Interesting Story Line , Director Nag Ahswin, Flim-TeluguStop.com

ఎందుకంటే ఆయన మహానటి దర్శకుడు.ఆ సినిమాను నిర్మించబోతున్నది వైజయంతి మూవీస్ వారు మరియు లెజెండ్రీ డైరెక్టర్‌ సంగీతం శ్రీనివాస్ మెంటర్‌ గా కూడా ఈ సినిమాకు వ్యవహరించబోతున్నాడు.

ఇన్ని ప్రత్యేకతలు ఉన్న కారణంగా ప్రతి ఒక్క తెలుగు సినీ ప్రేమికుడు ఈ సినిమా ఎలా ఉంటుంది అంటూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఎట్టకేలకు ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించబోతున్న సమయంలో కరోన సెకండ్‌ వేవ్‌ కారణంగా వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు.

మరో వైపు ఈ సినిమా గురించి మరో ఆసక్తికర వార్త ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది.

నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా సైన్స్‌ ఫిక్షన్‌ అంటూ సోసియో ఫాంటసీ అంటూ టాక్‌ వినిపిస్తుంది.

ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్‌ వార్త ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం 2050 సంవత్సరానికి చెందిన కథ అంటూ ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి.2050 లో జనాలు ఎలా ఉంటారు.అసలు అప్పటి పరిస్థితులు ఏంటీ అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

మరో 30 ఏళ్లు అడ్వాన్స్ గా ఆలోచించడం అంటే మామూలు విషయం కాదు.అలా ఈ సినిమాలో అప్పటి కథను చూపించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

గతంలో ఆధిత్య 369 వంటి విభిన్నమైన సినిమాను టైమ్ ట్రావెల్‌ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు సింగీతం ఈ సినిమా కు లీడ్స్ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది.ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్ ఇంకా సాగుతోంది.

ముప్పై ఏళ్ల తర్వాత ప్రపంచం ఎలా ఉండబోతుంది అనే విషయాలను కొందరు రచయితలు ఊహిస్తూ బుక్స్ రాశారు.వాటి ఆధారంగా ఈ సినిమాను రూపొందించబోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube