ఓ పక్క కరోనా కేసులు పెరుగుతుండగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతం చేసింది కేంద్రం.రాష్ట్ర ప్రభుత్వాలకు కావాల్సిన విధంగా వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచేలా ప్రయత్నాలు చేస్తుంది.ఈ క్రమంలో మే 1 నుండి జూన్ 15 వరకు 5.86 కోట్ల వ్యాక్సిన్ డోస్ లను సరఫరా చేస్తారని వెల్లడించారు.రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వ్యాక్సిన్ డోస్ లను ఉచితంగా ఇస్తామని స్పష్టం చేసింది కేంద్రం.జూన్ చివరి నాటికి ఇవి కాకుండా మరో 4.87 కోట్ల వ్యాక్సిన్ డోస్ లు వస్తాయని చెప్పారు.వీటిని రాష్ట్రాలు నేరుగా తీసుకునే అవకాశం ఉందని చెప్పారు.
ఇక వ్యాక్సిన్ వేసేందుకు కూడా జిల్లాల వారిగా వ్యాక్సిన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది.కొవిడ్ పోర్టల్ ద్వారా వ్యాక్సిన్ రిజిస్టర్ చేసుకున్న వారికి వ్యాక్సిన్ వేయనున్నారు.
అయితే ఆ ర్జిస్ట్రేషన్ గురించి కూడా ప్రజల్లో అవగాహన కల్పించేలా ప్రచారం చేయాలని అన్నారు.రిజిస్టర్ అయిన వారికి మాత్రమే వ్యాక్సిన్ వేసుకునే అవకాశం ఉంటే వ్యాక్సిన్ కేంద్రాల దగ్గర రద్దీని నివారించ వచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.
అయితే అందుంబాటులో ఉన్న వ్యాక్సిన్ లను ప్రజలు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ద్వారా వేయించుకోవాలని చెబుతున్నారు.వ్యాక్సిన్ వేసుకున్న వారిలో కరోనా నియంత్రణ శక్తి ఎక్కువగా ఉంటుందని తేలింది.