ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో టాలీవుడ్, బాలీవుడ్ సినిమా షూటింగులతో పాటు సినిమా విడుదల కూడా వాయిదా పడ్డాయి.ఇప్పటికే పలు చోట్ల థియేటర్లు బంద్ చేయగా సినిమా విడుదలను కూడా వాయిదా వేసుకున్నారు మన స్టార్ హీరోలు.
ఇక కొన్ని సినిమాలు ఓటీటీ లో విడుదల చేయడానికి ముందుకు రాగా స్టార్ హీరోల సినిమాలు మాత్రం ఇప్పటంతలా వచ్చేలా లేవు.కానీ ఒక స్టార్ హీరో సినిమా మాత్రం ఓటీటీ లో విడుదల కానుంది.
ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు.
కోలీవుడ్ యంగ్ సూపర్ స్టార్ హీరో ధనుష్ధనుష్ నటించిన సినిమాలన్నీ మంచి సక్సెస్ తో తెరకెక్కుతాయి.
ఇక ఈయన ఇటీవలే నటించిన ‘కర్ణన్’ సినిమా కూడా విడుదలవ్వగా ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది.ఇక యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘జగమే తంతిరామ్’ సినిమాలో నటిస్తున్నాడు.
వై నాట్ స్టూడియోస్ నిర్మాణంలో శశికాంత్ నిర్మిస్తున్నాడు.అంతే కాకుండా తెలుగులో ‘జగమే తంత్రం‘ అనే పేరుతో విడుదల కానుంది.

ఇక ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తుంది.ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తయింది చాలా రోజులు అవ్వగా విడుదలకు మాత్రం కుదరలేదు.ఇక ప్రస్తుతం థియేటర్లలో విడుదల చేయాలని అనుకోగా.కరోనా నేపథ్యంలో థియేటర్లు మూతపడ్డాయి.ఇక ఈ సినిమాను ఓటీటీ లో విడుదల చేయాలని నిర్ణయించుకోగా జూన్ 11 లేదా 13వ తేదీన స్ట్రీమింగ్ పెట్టాలని అనుకుంటున్నారట.ఇక మే 14వ తేదీన సినిమాను విడుదల చేయాలని ఆలోచనలో ఉన్నారట.
మొత్తానికి ఈ స్టార్ హీరో సినిమా ఓటీటీ లో విడుదలకు ముందు కు వచ్చింది.