వైరల్ : కన్న కొడుకులనే కాడెద్దులుగా మార్చిన రైతు..ఎక్కడంటే..?

రైతే రాజు అన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు.రైతులు వారి కాడెద్దులను సొంత మనుషుల్లాగా, కుటుంబంలోని మనుషుల్లాగా చూసుకుంటూ ఉంటారు.

 Viral The Farmer Who Turned His Sons Into Buffaloes Where, Farmer , Two Sons, P-TeluguStop.com

వాటికి ఎటువంటి కష్టం వచ్చినా కానీ ఆ రైతు కూడా ఎంతో బాధపడుతూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.అలాగే ఎద్దులు ఏదైనా అనారోగ్యానికి గురి ఆయన సమయంలో కూడా రైతు చాలా విలవిలలాడిపోతూ ఉంటాడు.

అచ్చం అలాంటి సంఘటన ఒకటి కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

కర్నూలు జిల్లాలోని జిల్లపాడుకు చెందిన రాముడు తన కాడెద్దులలో ఒకటి అనారోగ్యానికి అవ్వడంతో బండిని లాగ లేకపోవడం గమనించి, కాడెద్దులు తప్పించి మరీ తన సొంత కొడుకులతో బండిని లాగించాడు.ఐతే ప్రస్తుతం గ్రామంలో ఎలాంటి వ్యవసాయ పనులు లేకపోవడంతో ప్రతిరోజు  ఇసుక తరలిస్తు జీవనం కొనసాగిస్తున్నాడు.

  ఈ క్రమంలో రోజులాగే బండితో నందికొట్కూరుకు ఇసుక తరలించి తిరిగి వస్తున్న సమయంలో ఒక ఎద్దు అనారోగ్యానికి గురి అయ్యింది.ఒక్కసారిగా బండిని లాగలేక ఆగిపోయింది.ఇది గమనించిన రైతు రాముడు ఇంటి వద్ద ఉన్న కుమారులను పిలిపించి మరి ఎద్దుల బండినీ లాక్కొని రమ్మని చెప్పి ఆ కాడెద్దులను తోలుకొని ఇంటికి తీసుకొని వెళ్ళాడు.ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ చక్కర్లు కొడుతోంది.

అచ్చం ఇలాంటి సంఘటన ఒకటి ఇదివరకు చిత్తూరు జిల్లాలో జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube