రాత్రిపూట కర్ఫ్యూ జాబితాలోకి దేశంలో మరో రాష్ట్రం..!!

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే.దాదాపు లక్షకుపైగా ఆదివారం నుండి కొత్త కేసులు బయటపడుతూ ఉండటంతో ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ కాబోతున్నారు.

 Aravind Kejriwal To Impose Night Curfew In Delhi Also , Modi, Corona Virus, Del-TeluguStop.com

కరోనా నిబంధనల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా అమలు చేయాలని ఇప్పటికే దిశానిర్దేశం చేయడం జరిగింది.ముఖ్యంగా కేసులు ఎక్కువగా బయటపడుతున్న రాష్ట్రాలలో అక్కడి ప్రభుత్వాలు కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేపిస్తూ మాస్కు పెట్టుకొని వారికి భారీగానే జరిమానా విధిస్తూ ఉంది.

ముఖ్యంగా దేశంలో సగానికి పైగా కేసులు మహారాష్ట్రలో ఉండటంతో ఇప్పటికే అక్కడ వీకెండ్ లాక్ డౌన్ అమలు చేస్తూ ఉండగా రాత్రిపూట  కర్ఫ్యూ విధిస్తూ ఉన్నారు.మహారాష్ట్ర మాత్రమే కాక ఇతర రాష్ట్రాలలో  కర్ఫ్యూ రాత్రిపూట విధిస్తున్నారు.

ఇప్పుడు ఇదే జాబితాలో కి దేశ రాజధాని ఢిల్లీ కూడా చేరిపోయింది.ఈరోజు నుండి ఏప్రిల్ 30 వ తారీఖు వరకు రాత్రిపూట ఢిల్లీ రాష్ట్రంలో కర్ఫ్యూ విధించడానికి డిసైడ్ అయ్యారు ముఖ్యమంత్రి కేజ్రీవాల్.

రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు ఎవరు కూడా రాష్ట్రంలో బయటకు రాకుండా ఉండే రీతిలో ఢిల్లీలో రాత్రి పూట కర్ఫ్యూ విధించడానికి అక్కడి ప్రభుత్వం రెడీ అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube