తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోగా పరిచయం అయి వాళ్ల వాళ్ల అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నప్పటికీ కొందరికి మాత్రమే ఇక్కడ మంచి అవకాశం అనేది దక్కుతుంది.అలాగని డబ్బులు ఉన్నంత మాత్రాన ఇండస్ట్రీలో నటుడిగా మంచి పేరు సంపాదించుకోవచ్చు అంటే మాత్రం కుదరదు.
ఎందుకంటే నటించే వాళ్లకి మాత్రమే ఇక్కడ ఎక్కువ కాలం అవకాశాలు ఉంటాయి.ఇండస్ట్రీకి వచ్చి సినిమాలు చేస్తూ గుర్తింపు పొందుతూ ఉండి, మరోవైపు బిజినెస్ లను చూసుకుంటూ తనకు వీలు దొరికినప్పుడు సినిమాలు చేస్తూ, అటు బిజినెస్ ని కవర్ చేస్తూ వస్తున్న ఏకైక హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది సచిన్ జోషి అని చెప్పొచ్చు.
ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఎందుకంటే ఆయన తెలుగులో చాలా సినిమాల్లో నటించి తన నటనతో మన అందరిని మెప్పించారు.
మొదటగా మౌనమేలనోయి అనే సినిమాలో హీరోగా నటించి మంచి గుర్తింపును సాధించారు, ఆ తర్వాత ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఒరేయ్ పండు సినిమా లో తన నటనకు మంచి గుర్తింపు వచ్చింది.సచిన్ మంచి నటుడు అయినప్పటికీ అతనికి అవకాశాలు పెద్దగా రాలేదు ఎందుకంటే ఆయన చేసే సినిమాలు పెద్దగా ఆడలేదని చెప్పాలి.ఆషీకీ 2 సినిమాని తెలుగులో బండ్ల గణేష్ ప్రొడ్యూసర్ గా నీ జతగా నేనుండాలి అనే పేరుతో రీమేక్ చేశారు అది కూడా ఆశించిన విజయాన్ని అందించలేకపోయింది.దాంతో ప్రస్తుతం మంచి కథ దొరికితే సినిమా చేద్దాం అనే ఆలోచనలో ఆయన ఉన్నట్టు తెలుస్తుంది.
సచిన్ జోషి గురించి ఇప్పటి వరకు చెప్పిందంతా ఒక ఎత్తయితే అతని గురించి చెప్పాలంటే చాలా ఉంది.సచిన్ జోషి మనకి హీరో గాని ఎక్కువగా తెలుసు కానీ ఆయనకు ఉన్న ఆస్తులను లెక్కేస్తే ఆయన అంబానికి ఏ మాత్రం తీసిపోడు.
రెస్టారెంట్స్, రిసార్ట్ లు, హోటల్స్, స్పా సెంటర్లు, సాఫ్ట్ వేర్ కంపెనీలు లాంటి చాలా బిజినెస్ లు తనకి ఉన్నాయి.రోజుకి బిజినెస్ ల ద్వారా తనకు వచ్చే ఆదాయం అక్షరాల మూడు కోట్ల రూపాయలు ప్రస్తుతం ఆయన బిలినియర్ గా కొనసాగుతున్నాడు.అలాగే సినిమా వాళ్లకు అప్పు ఇస్తూ ఉంటాడు దాంట్లో భాగంగానే బండ్ల గణేష్ కి 30 కోట్ల వరకు అప్పు ఇచ్చాడని బండ్ల గణేష్ ప్రవర్తన నచ్చక 30 కోట్లు సైతం వద్దని వదిలేసుకున్నారు అలాంటి వ్యక్తి సచిన్ జోషి.ప్రస్తుతం ఆయన దగ్గర బెంజు, ఆడి, బీఎండబ్ల్యూ లాంటి కొత్తరకం కార్లు ఎన్నో ఉన్నాయి అలాగే వరల్డ్ ఫేమస్ అండ్ మోస్ట్ సెక్యూర్ కార్ అయిన హమ్మర్ కార్ ని ఆయన వాడుతున్నారు.
ఈ కారు లీటర్ కి మూడు కిలోమీటర్లు మైలేజ్ మాత్రమే ఇస్తుంది అయిన కూడా ఆయన దాన్ని వాడుతూ ఉన్నారు.
ఆయన వాడే వాచ్ ఆర్మన్ స్పెషల్ మెట్ అలాగే ఆయన వేసుకున్న బట్టలు,షూస్ లాంటివి హాలీవుడ్, బాలీవుడ్ డిజైనర్లతో చాలా రిచ్ గా డిజైన్ చేయిస్తూ ఉంటారు.ఇవన్నీ చేస్తూనే కొన్ని సేవా కార్యక్రమాలను కూడా చేస్తూ ఉంటారు.అదేంటంటే ఆయనకు నెల కి వచ్చే ఇన్కమ్ లో 5% క్యాన్సర్ పేషెంట్ల కోసం కేటాయిస్తూ ఉంటారు.
సచిన్ జోషి గురించి మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి అలాగే నాగచైతన్య సమంతలా రిసెప్షన్ కూడా తన రిసార్ట్ లోనే జరిగింది.హీరో గా పెద్దగా సక్సెస్ కాకపోయిన మంచి బిజినెస్ మ్యాన్ గా దూసుకుపోతున్నాడని చెప్పాలి.
ఆయనకి మాఫియా వాళ్ళతో కూడా చాలా సంబంధాలు ఉన్నట్టు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి.అయితే ప్రస్తుతం ఏదైనా మంచి స్టోరీ దొరికితే తెలుగులో సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు సచిన్ జోషి.
అలాగే తను క్రికెట్ కూడా బాగా ఆడతాడు అప్పట్లో వచ్చిన సెలబ్రిటీ లీగ్ లో టాలీవుడ్ తరపున ఆడి తనదైన క్రీడా ప్రతిభను చాటుకున్నాడు టాలీవుడ్ గెలవడానికి తన వంతు ప్రయత్నం చేశాడు.చూద్దాం మరి సచిన్ జోషి ఒక మంచి సినిమాతో హీరోగా నిలబడాలి అనుకునే తన కోరిక నెరవేరుతుందో, లేదో.