ప్రస్తుత కాలంలో థియేటర్లలో విడుదలవుతున్న సినిమాలు థియేటర్లలో వారం, రెండు వారాలు మాత్రమే ఆడుతున్నాయి.దర్శకనిర్మాతలు సైతం ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో సినిమాను విడుదల చేసి తొలి మూడు రోజుల్లోనే ఎక్కువ మొత్తంలో కలెక్షన్లను రాబట్టుకుంటున్నారు.
పైరసీ వల్ల నిర్మాతలకు భారీగా నష్టం వాటిల్లుతున్న నేపథ్యంలో నిర్మాతలు సోలోగా సినిమాలను రిలీజ్ చేసి భారీగా కలెక్షన్లను రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే కొన్ని టాలీవుడ్ సినిమాలు ఏకంగా 1,000 రోజుల కంటే ఎక్కువ రోజులు ఆడటం గమనార్హం.1,000 రోజుల కంటే ఎక్కువ రోజుల ఆడిన సినిమాల్లో మొదట 57 సంవత్సరాల క్రితం విడుదలైన లవకుశ సినిమా గురించి చెప్పుకోవాలి.1963 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా ఆ కాలంలోనే కోటి రూపాయల కలెక్షన్లను సాధించడంతో పాటు థియేటర్ లో ఏకంగా 1,111 రోజులు ఆడిన సినిమాగా రికార్డులకెక్కింది.

స్టార్ హీరో మహేష్ బాబు, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన పోకిరి సినిమా 2006 సంవత్సరంలో విడుదలై కలెక్షన్లపరంగా రికార్డులు సృష్టించింది.ఈ సినిమా థియేటర్ లో 1,000 రోజులకు పైగా ఆడటం గమనార్హం.దర్శకధీరుడు రాజమౌళి, రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన మగధీర బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
మగధీర సినిమా థియేటర్ లో 1,001 రోజులు ఆడటం గమనార్హం.
ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కి 2014 సంవత్సరంలో విడుదలైన లెజెండ్ సినిమా కూడా కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులను క్రియేట్ చేసింది.ఈ సినిమా ప్రొద్దుటూర్ లోని ఒక థియేటర్ లో ఏకంగా 1,005 రోజులు ఆడింది.
ఈ నాలుగు సినిమాలు ఎక్కువ రోజులు ఆడిన సినిమాలుగా అరుదైన గుర్తింపును సొంతం చేసుకోవడం గమనార్హం.