ఇండస్ట్రీలో చాలామంది కష్టపడి ఎవరి అండదండలు లేకుండా వచ్చి వాళ్ళ కాళ్లపై వారు నిలబడి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.ఇలాంటి వారిలో మొదటి స్థానంలోమెగాస్టార్ చిరంజీవి ఉన్నారు.
చిరంజీవి ఇన్స్పిరేషన్ తో వచ్చి చిరంజీవి తరహాలోనే ఇండస్ట్రీలో సోలో గా ఎదిగిన హీరో రవితేజ. మొదట్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసి తర్వాత విలన్ పాత్రలు వేసిన రవితేజ ఆ తర్వాత అనతికాలంలోనే హీరో గారి చాలా సినిమాల్లో నటించారు.
కృష్ణవంశీ తీసిన సింధూరం సినిమాలో బ్రహ్మాజీ మొదటి హీరో కాగా రవితేజ సెకండ్ హీరోగా చేసి మంచి గుర్తింపు సాధించాడు.ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం సినిమాతో సోలో హీరోగా మంచి సక్సెస్ కొట్టి తనకంటూ ఒక గుర్తింపు సాధించుకున్నారు.
ఆ తర్వాత పూరి జగన్నాథ్ డైరెక్షన్ లోనే వరుసగా ఇడియట్, అమ్మానాన్న తమిళ అమ్మాయి లాంటి సినిమాలు చేసి ఇండస్ట్రీలో హైట్రిక్ హిట్ కొట్టిన హీరో గా గుర్తింపు పొందాడు.ఆ తర్వాత రవితేజ హీరోగా వెనక్కి తిరిగి చూడలేదు వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరో అయిపోయాడు.
బోయపాటి శీను దర్శకత్వంలో వచ్చిన భద్ర సినిమాలో తను చేసిన నటన కి మంచి గుర్తింపు లభించింది.ఇప్పటికీ భద్ర సినిమా కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.
తెలుగు లో దర్శక ధీరుడు అయిన రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన విక్రమార్కుడు సినిమా లో విక్రమ్ సింగ్ రాథోడ్ గా సీరియస్ క్యారెక్టర్ చేస్తూనే అత్తిలి సత్తిబాబు క్యారెక్టర్ లో తన కామెడీతో జనాలను ఎంటర్టైన్ చేశాడు.ఆ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన కిక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.
కిక్ సినిమా లో దొంగతనాలు చేస్తూ అనాధ పిల్లలకు సర్జరీ చేయిస్తూ వాళ్లకి కావాల్సిన ఆలనా పాలనా చూసుకునే క్యారెక్టర్ లో ఒదిగిపోయి నటించాడు.ఈమధ్య అనిల్ రావిపూడి దర్శకత్వం లో రవితేజ హీరోగా వచ్చిన రాజా ది గ్రేట్ సినిమా లో రవితేజ బ్లైండ్ క్యారెక్టర్లో నటించి తను మాత్రమే ఇలాంటి క్యారెక్టర్లు చేయగలడు అని నిరూపించిన ఏకైక హీరో.
రీసెంట్ గా రిలీజైన క్రాక్ సినిమా మంచి విజయాన్ని సాధించింది గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ తీసిన మూడో సినిమా ఇది అయితే రవితేజ ఎంత పెద్ద హీరో అయినప్పటికీ తన ఫ్యామిలీనీ మాత్రం ఎప్పుడు మీడియా ముందుకు తీసుకురాడు.సోషల్ మీడియా పుణ్యమా అని మొన్నీమధ్య తన ఫ్యామిలీతో కలిసి ఒక సెల్ఫీ దిగి ఇన్స్టా లో అప్లోడ్ చేసే దాకా తన ఫ్యామిలీ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు.
రవితేజ భార్య పేరు కళ్యాణి ఆవిడ ఎవరో కాదు రవితేజ వాళ్ళ మేనమామ కూతురు.వీళ్ళకి ఇద్దరు పిల్లలు అమ్మాయి పేరు మోక్షదా అబ్బాయి పేరు మహాధన్.
అయితే మహధన్ మనకి రాజా ది గ్రేట్ సినిమా లో చిన్నప్పుడు రవితేజ క్యారెక్టర్ ని చేశాడు.ప్రస్తుతం మహాధన్ సినిమాలను పక్కన పెట్టి బుద్ధిగా చదువుకుంటున్నాడు ఫ్యూచర్లో ఇండస్ట్రీకి వచ్చినా కూడా ప్రస్తుతం చదువు మీద ఇంట్రెస్ట్ చూపించమని రవితేజ వాళ్ల అబ్బాయితో చెప్పాడట.

ప్రస్తుతం రవితేజ రాక్షసుడు లాంటి సినిమాతో మంచి హిట్ కొట్టిన రమేష్ వర్మ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.ఇంతకుముందు రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ వీర అని ఒక సినిమా కూడా చేశాడు.అది కమర్షియల్గా వర్కౌట్ కానప్పటికీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి రాక్షసుడు లాంటి హిట్ ఇచ్చాడు కాబట్టి రవితేజ రమేష్ వర్మ కి మళ్లీ ఛాన్స్ ఇచ్చాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.అయితే రవితేజ ఎంత ఎత్తుకు ఎదిగినా తన ఫ్యామిలీనీ మాత్రం చాలా రహస్యంగా ఎవరికీ తెలియకుండా ఉంచుతాడు రవితేజ కి ముందు విక్టరీ వెంకటేష్ కూడా ఇలానే తన ఫ్యామిలీనీ సినీ జనాలకి గాని అభిమానులకు కానీ తెలియకుండా గోప్యంగా ఉంచేవాడు.
వెంకటేష్ తరహాలోనే ప్రస్తుతం రవితేజ కూడా అలాగే చేస్తున్నాడని సినిమాకు సంబంధించిన చాలామంది చెబుతున్నారు.