వైరల్: ఈ లోకాన్ని విడుస్తూ ఐదుగురికి ప్రాణదానం చేసిన చిన్నారి.!

కొన్నిసార్లు ఊహకు అందని పనులు అలా జరిగిపోతూవుంటాయి.కళ్ళు మూసి తెరిచేలోపు ఎన్నో సంఘటనలు జరిగిపోతూ ఉంటాయి.

 Dhanistha, 20 Months Old, Girls, 5 Members, Death, Delhi ,22 Months Child,body P-TeluguStop.com

కనురెప్ప మూసి తెరిచేలోగా ఎన్నో మరణాలు, ఎన్నో పుట్టుకలు సంభవిస్తూ ఉంటాయి.ఇలా ప్రతి క్షణం మనిషి ఒక చోట నిలబడి పోతాడేమో కానీ సమయం మాత్రం ముందుకు దూసుకెళ్తు ఉంటుంది.

ఇక అసలు విషయంలోకి వెళితే.

కేవలం 20 నెలలు గడవకముందే ఓ చిన్నారి ప్రాణాలు విడిచి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కన్నవారికి సోకాన్ని మిగిలిస్తూ పరలోకానికి వెళ్లిపోయింది ఆ చిన్నారి.అయితే ఆ చిన్నారి వెళ్తూ వెళ్తూ ఐదుగురికి ప్రాణదానం చేస్తూ వెళ్ళింది.

ఢిల్లీ నగరంలోని రోహిణి ప్రాంతానికి చెందిన ధనిష్తా అనే ఓ చిట్టి తల్లి కేవలం 20 నెలల వయసులోనే ప్రాణదాతగా మారి అందరినీ విడిచిపెట్టి వెళ్ళింది.ఈ చిన్నారి వారం రోజుల క్రితం ఇంటి బాల్కనీలో ఆడుకుంటూ కింద పడిన సందర్భంలో ఆ చిన్నారిని ఆసుపత్రిలో చేర్పించగా మూడు రోజుల క్రితం పాపకు బ్రెయిన్ డెడ్ అయ్యింది.

దీంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఆ సమయంలో ఆ చిన్నారి తల్లిదండ్రులు ఆ పాపకు సంబంధించిన అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకున్నారు.

Telugu Delhi, Dhanistha-Latest News - Telugu

ఆ చిన్నారి నుండి తీసుకున్న అవయవాలతో ఐదుగురి ప్రాణాలను కాపాడినట్లు వైద్యులు తెలిపారు.పాపకు సంబంధించిన గుండె, కాలేయం, కార్నియా, రెండు కిడ్నీలు మొత్తం ఐదు అవయవాలను ఐదుగురు పేషెంట్లకు అందించినట్లు వైద్యులు తెలిపారు.ఈ నిర్ణయాన్ని తాము అవయవాల కోసం చూస్తున్న పలువురిని కలిసినప్పుడు తాము ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చిన్నారి తండ్రి ఆశిష్ కుమార్ తెలిపారు.తమ పాప చనిపోయినా ఆ అయిదుగురిలో తమ పాప బ్రతికే ఉంటుందని ఆనుకొని తాము అవయవాలు దానం చేసినట్లు ఆయన చెప్పాడు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube