దశాబ్దం క్రితం యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి యాంకరింగ్ ద్వారా మంచి పేరు సంపాదించుకున్నారు యాంకర్ లాస్య.యాంకర్ రవి లాస్య కలిసి చేసిన షోలు బుల్లితెరపై సూపర్ హిట్టయ్యాయి.
రవి లాస్య మధ్య ఏదో ఉందని లాస్య కెరీర్ మొదట్లో గాసిప్స్ వినిపించగా ఆమె పలు సందర్భాల్లో తమ మధ్య ఏం లేదని స్పష్టతనిచ్చారు.ఆ తరువాత ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్యూలో లాస్య రవిపై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.
బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొని స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్న లాస్య్ బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తుంది.ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లలో కొందరు లాస్య స్మైల్ కన్నింగ్ స్మైల్ అని కామెంట్లు చేశారు.
వీకెండ్ ఎపిసోడ్ లో సుమ గెస్ట్ గా హాజరు కాగా అవినాష్ హౌస్ లోని ఒక అమ్మాయికి బిస్కెట్లు వేస్తున్నాడని చెప్పింది.అవినాష్ ఆ అమ్మాయి ఎవరో చెప్పాలని సుమ కోరగా అవినాష్ మాత్రం ఏం చెప్పలేదు.

దీంతో హౌస్ లో ఒక్కో అమ్మాయిని సుమ అడుగుతూ రాగా లాస్య తాను అమ్మాయిని కాదని ఆంటీనని చెప్పింది.ఆ సమయంలో బిగ్ బాస్ హౌస్ లోని హౌస్ మేట్స్ సైతం ఘొల్లున నవ్వేశారు.ఆ తరువాత నుండి కంటెస్టెంట్ సొహైల్ లాస్యను పదేపదే ఆంటీ అని పిలుస్తున్నాడు.సొహైల్ అలా పిలవడంతో బిగ్ బాస్ హౌస్ లో లాస్య, సొహైల్ మధ్య చిన్నపాటి గొడవ జరిగింది.
సొహైల్ లాస్యతో వీకెండ్ ఎపిసోడ్ లో మీరు ఆంటీ అని చెప్పారు కాబట్టి ఆంటీ అని పిలుస్తున్నానని చెప్పగా తాను చెప్పుకుంటానని.అవతలి వాళ్లు మాత్రం అలా పిలవకూడదని.పదేపదే ఆంటీ అని పిలిస్తే యాంటీ అయిపోతానని అన్నారు.31 ఏళ్ల లాస్య తన కంటే రెండు, మూడేళ్ల చిన్నవాళ్లు ఆంటీ అని పిలిస్తే ఫీల్ కావడంలో తప్పేం లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.